మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీని నమోదు చేసుకున్నాడు. గోవా రంజీ టీమ్ తరపున దేశవాళీ బరిలో దిగిన అర్జున్ టెండూల్కర్ రాజస్థాన్ జట్టుతో గ్రూప్-సి మ్యాచ్‌లో అందరినీ ఆకట్టుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అర్జున్ 207 బంతుల్లో 120 పరుగులు చేశాడు. ఇందులో 16ఫోర్లు, 2 సిక్సులు వున్నాయి.
మాస్టర్ సచిన్ తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీతో ఔరా అనిపించాడు. ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ కూడా తండ్రి బాటలోనే నడిచి తొలి మ్యాచ్‌తోనే శతక వీరుల జాబితాలో చేరాడు. ఈ ఘనతను 15ఏళ్ల వయస్సుల్లో సచిన్ సెంచరీ సాధించగా.. అర్జున్ 23 ఏళ్ల వయస్సులో సాధించాడు.
అర్జున్ టెండూల్కర్ అదిరిపోయే వంద పరుగులు సాధించి.. గోవా రెండో రోజు ఆట చివరికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 493 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్రభుదేశాయ్ డబుల్ సాధించినప్పటికీ ఈ మ్యాచ్‌లో హైలైట్ అంటే అర్జున్ టెండూల్కర్ ఇన్నింగ్సే అని చెప్పాలి.