టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ -అనుష్క ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. కూతురి ముఖం మీడియా కంటపడకుండా అనుష్క జాగ్రత్త పడగా.. కొందరు ఆమె తీరును తప్పుబడుతున్నారు. మరోవైపు ఫొటోజర్నలిస్టుల తీరుపైనా సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంగ్లాండ్ టూర్ కోసం ముంబైలో 14 రోజుల క్వారంటైన్లో ఉన్న టీమిండియా ప్లేయర్, స్టాఫ్, క్రికెటర్ల ఫ్యామిలీ మెంబర్స్ బుధవారం రాత్రి ఇంగ్లండ్ బయలుదేరారు.
ఈ మేరకు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ తమ కూతురు వామికతో కలిసి ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఫొటోలు వైరల్గా మారాయి. ఈ క్రమంలో ఫొటో జర్నలిస్టుల కంట తన బిడ్డ ముఖం పడకుండా వామికా ముఖాన్ని గట్టిగా అదిమిపట్టుకుని లోపలకి వెళ్లింది అనుష్క. దీంతో.. విరుష్క జోడీపై కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. కనీసం బిడ్డకు ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛనైనా ఇవ్వూ అంటూ కామెంట్లు పెడుతున్నారు.