Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీమిండియా చెత్త ప్రదర్శనపై ట్రోల్స్.. తనకు సంబంధం లేదన్న అనిల్ కుంబ్లే!!

Advertiesment
anil kumble

ఠాగూర్

, మంగళవారం, 17 డిశెంబరు 2024 (11:56 IST)
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో భాగంగా, భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భారత ఆటగాళ్ల ఆటతీరు అత్యంత చెత్తగా ఉంది. తొలి టెస్టులో బౌలర్ల చలువతో గెలిచిన భారత్.. రెండో టెస్ట్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి అంచుల వుంది. దీంతో భారత ఆటగాళ్ల ప్రదర్శన సోషల్ మీడియా వేదికగా విమర్శలు పేలుతున్నాయి. 
 
ముఖ్యంగా, భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఫోటో పేరుతో ఈ విష ప్రచారం సాగుతుంది. దీనిపై అనిల్ కుంబ్లే స్పందించారు. తన పేరు, ఫొటోతో సోషల్ మీడియా కథనాలు రావడంపై స్పందించారు. కొంతమంది తన ఫొటో ఉపయోగించి తమకు తోచిన విధంగా వార్తలు రాయడాన్ని ఆయన ఖండించారు. ఆ వార్తల్లోని వ్యాఖ్యలు, ఆ ఖాతాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కుంబ్లే 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పష్టం చేశారు.
 
ప్రస్తుతం బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత ఆటగాళ్ల ప్రదర్శనను తప్పుబడుతూ అనిల్ కుంబ్లే వ్యాఖ్యలు చేశారంటూ కొంతమంది ఆయన ఫొటోను ఉపయోగించి నెట్టింట నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారు. కెప్టెన్సీలో రోహిత్ శర్మ వైఫల్యం, బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లి ఘోరంగా విఫలం కావడంపై కుంబ్లే తీవ్ర విమర్శలు చేశాడనేది ఆ వార్తల సారాంశం. దాంతో అవన్నీ నకిలీ వార్తలని, వాటితో తనకేలాంటి సంబంధం లేదని తాజాగా క్లారిటీ ఇచ్చాడు. 
 
ఈ మేరకు కుంబ్లే ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. "కొన్ని సోషల్ మీడియా ఖాతాలు నా ఫొటోను ఉపయోగించి తప్పుడు వ్యాఖ్యలను నాకు ఆపాదిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఆ ఖాతాలు, అందులోని వ్యాఖ్యలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. సామాజిక మాధ్యమాల్లో చూసే ప్రతిదాన్ని నమ్మవద్దు. ఏదైనా సమాచారాన్ని పంచుకునే ముందు అది సరైనదో.. కాదో ధ్రువీకరించుకోండి. నా అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి. ఇలాంటి వాటి విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా" అని కుంబ్లే ట్వీట్ చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగ్లాదేశ్ క్రికెటర్‌ షకీబ్ హాసన్‌కు షాకిచ్చిన ఐసీసీ!!