Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో బ్యాలెన్స్ తప్పుతుంది : సునీల్ గవాస్కర్

sunil gavaskar

వరుణ్

, మంగళవారం, 25 జూన్ 2024 (15:33 IST)
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బ్యాట్‌తో మైదానంలో రాణించలేకపోతున్నారు. గత ఆరు మ్యాచ్‌లలో విరాట్ చేసిన పరుగులే ఇందుకు నిదర్శనం. ఆయన వరుసగా 1, 4, 0, 24, 37, 0 చొప్పున పరుగులు చేశాడు. దీనిపై భాత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. విరాట్ కోహ్లీ ఔటైన షాట్లను పరిశీలిస్తే బ్యాలెన్స్ లేదని తెలుస్తుందన్నారు. క్రీజ్ బయటకు వస్తే మాత్రం బ్యాలెన్స్‌తో ఆడాలని సూచించారు. 
 
ప్రస్తుతం సాగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన అతడు ఓపెనర్ వచ్చి వరుసగా 1, 4, 0, 24, 37, 0 చొప్పున పరుగులు చేశాడు. ఎంత దారుణంగా విఫలమయ్యాడో ఈ స్కోర్లను బట్టి చెప్పేయవచ్చు. ఇప్పటివరకు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. 
 
దీంతో విరాట్ ప్రదర్శన పట్ల టీమిండియా మేనేజ్మెంట్‌తో పాటు భారత అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో రాణించలేకపోయినా వెస్టిండీస్ వేదికగా జరిగే కీలక మ్యాచ్‌ల్లో రాణిస్తాడని ఆశించినప్పటికీ అతడి ప్రదర్శన మెరుగుపడలేదు. దీంతో విరాట్ ప్రదర్శనపై టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
 
విరాట్ కోహ్లీ క్రీజ్ బయటకు వచ్చి ఆడేటప్పుడు అతడి బ్యాలెన్స్ మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అతడు ఔట్ అయిన షాట్లను గమనిస్తే ఇది స్పష్టమవుతోందని అన్నారు. ఆంటిగ్వాలో బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో కోహ్లీ బ్యాలెన్స్ సరిగ్గా లేదని అన్నారు. ఔట్ షాట్లలో అతడి బ్యాలెన్స్ బాలేదని అన్నారు. కోహ్లీ పిచ్‌పై మరింత సమయం గడిపితే అతడి విశ్వాసం మరింత పెరుగుతుందని సునీల్ గవాస్కర్ సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : సెమీస్‌తో భారత్ ఎవరితో తలపడుతుంది?