Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాస్కులు తీసేసి స్వేచ్ఛగా తిరిగే రోజులు వస్తాయ్.. ఫోటో వైరల్

మాస్కులు తీసేసి స్వేచ్ఛగా తిరిగే రోజులు వస్తాయ్.. ఫోటో వైరల్
, శుక్రవారం, 16 అక్టోబరు 2020 (09:23 IST)
newborn baby
కరోనా వైరస్ నేపథ్యంలో మాస్కులు వాడటం తప్పనిసరిగా మారింది. కానీ త్వరలో ప్రజలు మాస్కులు తీసేసి స్వేచ్ఛగా తిరిగే రోజులు వస్తాయని తెలిపారు యూఏఈకి చెందిన డాక్టర్‌ సమీర్‌ చీబ్. అంటే కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ వస్తుంది అనుకుంటే పొరబడినట్లే. డాక్టర్‌ సమీర్‌ చీబ్ ఉద్దేశ్యం వేరు. ఇటీవల డాక్టర్‌ సమీర్‌ చీబ్ తన ఆసుపత్రిలో ఓ మహిళకు డెలివరీ చేశాడు.
 
అప్పుడు పుట్టిన శిశువును డాక్టర్ చేతుల్లోకి తీసుకున్నాడు. దీంతో ఆ శిశువు డాక్టర్‌ సమీర్‌ చీబ్ ధరించిన మాస్క్‌ను తొలగించే ప్రయత్నం చేసింది. దీంతో ప్రపంచం మాస్కును తొలగించే రోజు త్వరలో వస్తుందని, ఈ విషయం ఆ పాప సింబాలిక్‌గా చెప్పిందని డాక్టర్ అన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను డాక్టర్ ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
 
"త్వరలోనే మాస్కును తొలగించే సమయం ఆసన్నం కావాలంటూ మనమందరం కోరుకుంటున్నాం కదా" అంటూ క్యాప్షన్‌ జతచేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పాప పుణ్యమాని మాస్కులు తొలగించే రోజులు త్వరలో రావాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చీరమేను.. దాని రుచి ఏం చెప్పేను!