Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవంబర్‌ 16 నుంచి శబరిమల దర్శనం.. కానీ పంబానదిలో స్నానాల్లేవ్!

నవంబర్‌ 16 నుంచి శబరిమల దర్శనం.. కానీ పంబానదిలో స్నానాల్లేవ్!
, మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (10:34 IST)
కరోనా కారణంగా మూతపడిన సుప్రసిద్ధ క్షేత్రం శబరి మల మళ్లీ తెరుచుకోనుంది. ఈ క్రమంలో నవంబర్‌ 16వ తేదీ నుంచి శబరిమలయాత్ర ప్రారంభం కానుంది. అయితే శబరిమలకు వచ్చే భక్తులు కరోనా నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. వర్చువల్‌ క్యూ విధానం ద్వారా పేర్లు రిజిస్టర్‌ చేసుకున్న వారికే ఆలయంలోకి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.
 
అయ్యప్పస్వామి దర్శనం అనంతరం భక్తులు వెనక్కి వెళ్లిపోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో ఉండేందుకు అవకాశం ఇవ్వబోమని, పంబానదిలో పుణ్యస్నానాలకు అనుమతి కూడా ఉండదని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
కాగా కేరళలోని శబరిమల ఆలయం నవంబర్ 16న మండల, మకర జ్యోతి దీక్ష చేసే యాత్రికుల కోసం తెరవబడుతుంది. ప్రతి శీతాకాలంలో రెండు నెలల మండలం- మకర జ్యోతి దర్శనాల సీజన్‌లో లక్షలాదిగా అయ్యప్ప భక్తులు స్వామిని దర్శించుకోవటానికి వస్తారు. శబరిమల ఆలయాన్ని ప్రతి ఏటా 30 లక్షల మంది యాత్రికులు సందర్శిస్తారు. అయితే ఈ ఏడాది కోవిడ్ కారణంగా శబరిమల ఆలయం మూత పడింది. 
 
ప్రస్తుతం తెరుచుకోనున్న శబరిమలలో కోవిడ్ -19 ప్రోటోకాల్‌లు పాటించబడతాయని, భక్తుల సంఖ్య కూడా ఉంటుంది పరిమితం చేయబడుతుంది. భక్తులందరూ తీర్థయాత్ర చేపట్టే ముందు కోవిడ్-నెగటివ్ సర్టిఫికెట్లు సమర్పించడం తప్పనిసరి. దర్శనానికి వచ్చే భక్తులందరికీ స్క్రీనింగ్ చేస్తామని, వారికి కావలసిన మార్కులు శానిటైజర్ లను అందిస్తామని కరోనా వ్యాప్తి జరగకుండా దేవాదాయ శాఖ నుండి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైలు ప్రయాణికుల నెత్తిన యూజర్ చార్జీల మోత... అక్టోబరు నుంచి వసూలు!!