Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూకేలో ఒమిక్రాన్ అల్లకల్లోలం - 24 గంటల్లో లక్ష కరోనా కేసులు

Advertiesment
యూకేలో ఒమిక్రాన్ అల్లకల్లోలం - 24 గంటల్లో లక్ష కరోనా కేసులు
, గురువారం, 23 డిశెంబరు 2021 (11:58 IST)
అగ్రదేశాల్లో ఒకటైన యూకే (బ్రిటన్)లో ఒమిక్రాన్ వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. గత 24 గంటల్లో ఏకంగా 1,06,122 కొత్త కరోనా, ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
బ్రిటన్‌లో కరోనా వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు 11 మిలియన్ల కేసులు వెలుగు చూశాయి. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు 1,47,573 మంది మృత్యువాతపడ్డారు. అదేవిధంగా బ్రిటన్‌లో ఇప్పటివరకు 37,101 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను గుర్తిచారు. 
 
దీనిపై యూకే ఆరోగ్య మంత్రి సాజిద్ జావెద్ మాట్లాడుతూ, తమ దేశ ఔషధ కంపెనీలు తయారుచేసిన కోవిడ్-19 బూస్టర్ ప్రోగ్రామ్ బాగా పనిచేస్తుందని తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ చికిత్సలకు ప్రాప్యతను నిర్ధారించడం ద్వారా వైరస్ పట్ల మా జాతీయ ప్రతిస్పందన మరింత బలోపేతం చేయడం చాలా అవసరం అని ఆయన చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింగరేణిలో ప్రమాదం : డంపర్ ఆపరేటర్ కన్నుమూత