పరిశోధనాధారిత, సమగ్రమైన అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ, గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ గురువారం తాము 400 ఎంజీ రూపంలో నోటి ద్వారా తీసుకునే ఫ్యాబీ ఫ్లూ మాత్రలను పరిచయం చేశామని వెల్లడించింది. మోస్తరు నుంచి మధ్యస్తంగా కోవిడ్ 19 లక్షణాలను కలిగిన రోగుల చికిత్స కోసం ఈ మాత్రలను భారతదేశంలోని రోగుల కోసం వినియోగించనున్నారు. అత్యధిక శక్తివంతమైన ఈ టాబ్లెట్లు రోగి యొక్క సమ్మతి మరియు అనుభవాలను మెరుగుపరచడంతో పాటుగా రోగి రోజూ తీసుకునే ట్యాబ్లెట్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుంది.
అత్యధికంగా మాత్రలను తీసుకునే భారం కారణంగా చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు కూడా సన్నగిల్లుతుంటాయి. అంతేకాకుండా మొత్తంమ్మీద వైరస్ నిరోధించడం, చికిత్స ఫలితాలను సైతం ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా డాక్టర్లు మరియు రోగులు సైతం ఈ మాత్రల భారం తగ్గించాల్సిందిగా కోరడం జరిగింది. ఫాబీఫ్లూ 200ఎంజీ మోతాదులో రోగులు మొదటి రోజు 18 మాత్రలను తీసుకోవాల్సి ఉంటుంది (ఉదయం 9 మరియు రాత్రి 9). ఆ తర్వాత ప్రతి రోజూ 8 మాత్రలను 14 రోజుల పాటు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు నూతన 400ఎంజీ వెర్షన్‌తో, రోగులు ఇప్పుడు మరింత సౌకర్యవంతమైన మోతాదును అనుసరించవచ్చు. మొదటి రోజు 9 మాత్రలు (ఉదయం 4.5 బిళ్లలు మరియు రాత్రి 4.5 బిళ్లలు) తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత రెండవ రోజు నుంచి కోర్సు ముగిసే వరకూ రెండేసి ట్యాబ్లెటను రోజుకు రెండుసార్లు తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ మాత్రల ప్రాముఖ్యతను గురించి డాక్టర్ మోనికా టాండన్, వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్, క్లీనికల్ డెవలప్‌మెంట్, గ్లోబల్ స్పెషాలిటీ/బ్రాండెడ్ పోర్ట్‌ఫోలియో, గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో ఫావిపిరావిర్‌ను మొట్టమొదటిసారిగా పరిచయం చేసిన సంస్థగా, మేము స్థిరంగా ఆవిష్కరణలను జరుపుతుండటంతో పాటుగా కోవిడ్ 19 రోగుల కోసం నూతన చికిత్సావకాశాలను అన్వేషిస్తున్నాం. ఈ అత్యధిక శక్తివంతమైన ఫాబీఫ్లూను పరిచయం చేయడమన్నది ఈ ప్రయత్నాలలో భాగం. ఇది రోగులకు మరింత సౌకర్యవంతమైన అనుభవాలను వారు రోజూ తీసుకునే మాత్రల భారాన్ని తగ్గించి అందిస్తుంది’’ అని అన్నారు.
‘‘200 ఎంజీ మోతాదుతో కూడిన ఫాబీఫ్లూను ఫావిపిరావిర్ డ్రగ్ యొక్క అంతర్జాతీయ ఫార్ములేషన్స్‌తో అభివృద్ధి చేశారు. ఇది కూడా ఇదే తరహా శక్తి కలిగి ఉంటుంది. నూతన 400 ఎంజీ వెర్షన్ ఇప్పుడు గ్లెన్‌మార్క్ యొక్క సొంత ఆర్ అండ్ డీ ప్రయత్నాల ఫలితం. భారతదేశంలోని రోగుల చికిత్సానుభవాలను ఇది వృద్ధి చేస్తుంది’’ అని ఆమె జోడించారు.
గ్లెన్‌మార్క్ ఇప్పుడు పోస్ట్ మార్కెటింగ్ సర్వైవలెన్స్ (పీఎంఎస్) అధ్యయనంను ఫాబీఫ్లూపై ప్రారంభించింది. తద్వారా నోటి ద్వారా తీసుకునే యాంటీవైరల్ ఫావిపిరావిర్ సూచించబడిన రోగులలో ఔషధం యొక్క సామర్థ్యం, భద్రతను దగ్గరగా పర్యవేక్షించడం సాధ్యమవుతుంది. ఓపెన్ లేబుల్, మల్టీ సెంట్, సింగిల్ ఆర్మ్ అధ్యయనంలో భాగంగా దీనిని నిర్వహించారు. గ్లెన్‌మార్క్ ఇప్పుడు మూడవ దశ క్లీనికల్ ట్రయల్స్‌ను రెండు యాంటీ వైరల్ డ్రగ్స్ ఫావిపిరావిర్ మరియు యుమిఫెనోవిర్‌ను కాంబినేషన్ థెరఫీగా మధ్యస్త కోవిడ్ 19 లక్షణాలతో ఆస్పత్రులలో చేరిన రోగులపై చేస్తుంది.
ఈ కాంబినేషన్ థెరఫీని ఫెయిత్‌గా పిలుస్తున్నారు. భారతదేశంలో మధ్యస్త కోవిడ్ లక్షణాలు కలిగిన 158 హాస్పటలైజ్డ్ రోగులు ఈ చికిత్స తీసుకునేందుకు చూస్తున్నారు. కాంబినేషన్ థెరఫీ ముందస్తు చికిత్సను భద్రత, సామర్థ్యం కోసం పరిశీలిస్తారు. వైరస్ భారం తగ్గే కాలాన్ని ఇది తగ్గించడంలో ప్రభావవంతమైన మార్గంగా నిలువడంతో పాటుగా చికిత్స పరంగా మెరుగైన ఫలితాలు మరియు రోగులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి సహాయపడుతుంది.