Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకవైపు కరోనా.. మరోవైపు భయపెడుతున్న డెంగ్యూ..

Advertiesment
ఒకవైపు కరోనా.. మరోవైపు భయపెడుతున్న డెంగ్యూ..
, సోమవారం, 19 ఏప్రియల్ 2021 (20:25 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు కరోనా కోరలు చాస్తుండగా.. మరోవైపు డెంగ్యూ భయపెడుతుంది. ఇప్పటికే డెంగ్యూ వ్యాధికి గురై పలువురు చనిపోయినట్లు సమాచారం. ఢిల్లీలో మూడేళ్ల నాటి డెంగ్యూ రికార్డులు బద్ధలవుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో డెంగ్యూ విస్తరిస్తుంది. గత మూడు నాలుగు రోజులుగా డెంగ్యూ విస్తరిస్తుండటంతో అనేక మంది దవాఖానాల పాలవుతున్నారు. 
 
డెంగ్యూ కారణంగా ఇప్పటికే పలువురు మరణించినట్లు చెప్తున్నారు. 2018 తర్వాత అత్యధికంగా డెంగ్యూ రోగులు నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. గత వారంలో కొత్తగా నలుగురు డెంగ్యూతో చనిపోగా మొత్తం చనిపోయిన వారి సంఖ్య 13కు చేరుకుంది. 2016, 2017లలో 10 మంది చొప్పున రోగులు చనిపోగా.. 2018 సంవత్సరంలో నలుగురు, ​​2019 లో ఇద్దరు రోగులు మృత్యువాత పడ్డారు. 2015లో అత్యధికంగా 60 మంది చనిపోయారు.
 
ఇదే సమయంలో మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు గణనీయంగా వ్యాప్తి చెందకపోవడం ఉపశమనం కలిగించే విషయం. గత వారంలో మలేరియా రోగులు ఎవరూ నమోదు కాలేదు. ఈ ఏడాది మొత్తం మలేరియా రోగుల సంఖ్య నాలుగుకు పెరుగగా, చికున్‌గున్యా రోగుల సంఖ్య మూడుకి చేరింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Breaking News: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్