దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 19,078 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 22,926 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 24 గంటల్లోనే 224 మంది మరణించారు.
దేశవ్యాప్తంగా ఇప్పటికే కరోనా కేసులు ఒక కోటి మూడు లక్షలు దాటింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,50,183గా ఉంది. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 99,06,387గా ఉంది. దేశవ్యాప్తంగా వైరస్ వల్ల మరణించిన వారి మొత్తం సంఖ్య 1,49,218కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ కొనసాగుతున్నది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఏడు కేంద్రాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది.
హైదరాబాద్‌లోని గాంధీ దవాఖాన, నాంపల్లి ఏరియా దవాఖాన, తిలక్‌నగర్ యూపీహెలో, సోమాజిగూడ యశోద హాస్పిటల్, మహబూబ్ నగర్ జిల్లాలోని జానంపేట పీహెచ్‌సీ, మహబూబ్‌నగర్ జీజీహెచ్, నేహా షైన్ హాస్పిటల్‌లో డ్రైరన్ కొనసాగుతున్నది. ఒక్కో కేంద్రంలో 25 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.