Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డెల్టా ప్లస్ వైరస్‌ చాలా ప్రమాదకారి : రామన్ గంగఖేడ్కర్

Advertiesment
Raman Gangakhedkar
, శనివారం, 26 జూన్ 2021 (19:43 IST)
ప్రజలను కరోనా వైరస్ భయపెడుతోంది. ఇపుడు డెల్టా వైరస్ కొత్తగా వచ్చింది. ఇది కరోనా వైరస్ కంటే అత్యంత ప్రమాదకారిగా అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంపై ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగఖేడ్కర్ స్పందించారు. 
 
కొత్తగా ఉనికిలోకి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఆందోళనకర వైరస్‌గా పరిగణించాలని కోరారు. డెల్టా కంటే డెల్టా ప్లస్ వ్యాప్తి అధికమని చెప్పేందుకు ఆధారాలేవీ లేకపోయినప్పటికీ.. దీన్ని ఆందోళనకారకంగా గుర్తించాలన్నారు. 
 
అధికారిక సమాచారం ప్రకారం.. దేశంలో ఇప్పటివరకూ 50కి పైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్, కేరళ, మహారాష్ట్రలో ఈ తరహా కేసులు అధిక సంఖ్యలో నమోదవగా.. పంజాబ్, జమ్ముకాశ్మీర్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లోనూ ఈ వైరస్ అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. 
 
కాగా.. డెల్టా ప్లస్ విషయమై ఐసీఎమ్ఆర్ అంటువ్యాధుల విభాగం చీఫ్ డా. సమీరన్ పండా కూడా స్పందించారు. ఈ వేరియంట్‌కు సంబంధించిన కేసులు ఇప్పటివరకూ పది రాష్ట్రాల్లో వెలుగు చూసినప్పటికీ ఇది థర్డ్ వేవ్ ప్రారంభానికి సంకేతం కాదని స్పష్టం చేశారు. ఇలా భావించడమంటే.. తప్పుదారి పట్టడమేనని వ్యాఖ్యానించారు. థర్డ్ వేవ్ తీవ్రత సెకెండ్ వేవ్ అంతస్థాయిలో ఉండదని అభిప్రాయపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంపూర్ణ విద్యతోనే చిన్నారుల సర్వతోముఖాభివృద్ది: ఆంధ్రప్రదేశ్ గవర్నర్