Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా రోగుల సజీవ దహనం? ఎక్కడ?

కరోనా రోగుల సజీవ దహనం? ఎక్కడ?
, ఆదివారం, 15 నవంబరు 2020 (09:39 IST)
రొమేనియా దేశంలో తీరని విషాదం నెలకొంది. కరోనా బారిన పడి రోగులు చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10మంది కరోనా రోగులు సజీవ దహనం కాగా, మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు షాట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని నిర్ధారించారు. ఈ ఘటన పట్ల అక్కడి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
కాగా, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో కూడా ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్పత్రిలో కూడా ఇదే విధంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపుగా పది మంది వరకు చనిపోయిన విషయం తెల్సిందే. ఇపుడు రొమేనియా దేశంలో ఇదే తరహా ప్రమాదం సంభవించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొడుకు పుడతాడని నమ్మించిన భూతవైద్యుడు.. కుమార్తెను బలిచ్చిన తండ్రి!!