Publish Date: Mon, 07 Jun 2021 (18:50 IST)
Updated Date: Mon, 07 Jun 2021 (18:52 IST)
ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత నెలలో 20వేలకు పైగా రోజువారీ కేసులు నమోదవ్వగా.. గత కొద్దిరోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 4,872 కేసులు నమోదవ్వగా.. 86 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా 13,702 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,63,211కి చేరుకోగా.. మరణాల సంఖ్య 11,522కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 1,14,510 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే..
కోవిడ్ వల్ల చిత్తూరులో 13 మంది, గుంటూరులో పది మంది, అనంతపూర్ లో 9 మంది, శ్రీకాకుళంలో 9 మంది, విజయనగరంలో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఏడుగురు, ప్రకాశంలో ఆరుగురు, విశాఖలో ఆరుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, కర్నూలులో ఐదుగురు, నెల్లూరులో నలుగురు మరణించారు.
ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?
అనంతపూర్ 535. చిత్తూరులో 961. ఈస్ట్ గోదావరిలో 810. గుంటూరులో 374. వైఎస్ఆర్ కడపలో 404. కృష్ణాలో 175. కర్నూలులో 212. ప్రకాశంలో 447. శ్రీకాకుళంలో 166. విశాఖపట్ణణంలో 189. విజయనగరంలో 207. వెస్ట్ గోదావరిలో 160. మొత్తం కేసులు 4872.
సెల్వి
Publish Date: Mon, 07 Jun 2021 (18:50 IST)
Updated Date: Mon, 07 Jun 2021 (18:52 IST)