చైనాలో కోవిడ్ వైరస్ విజృంభిస్తోంది. ప్రతిరోజూ లక్షలాది మంది వైరస్ బారినపడుతున్నారు. రోజూ లక్షలాదిమందిని వైరస్ చుట్టుముడుతోంది. తాజాగా హెనాన్ రాష్ట్రంలోనే దాదాపు 8.85 కోట్ల మంది కరోనా బాధితులుగా మారినట్లు ప్రావిన్ియల్ అధికారి కాన్ క్యూయాన్ చెంగ్ తెలిపారు.
రాష్ట్రంలోని దాదాపు 90 శాతం మంది కరోనా బారినపడ్డారు. అలాగే ఓడరేవు నగరం క్వాంగ్ డావ్ లో క్రిస్మస్ సమయంలో రోజుకు ఐదు లక్షల కేసులు వెలుగులోకి వచ్చాయి. నిన్న మొన్నటి వరకు జీరో కొవిడ్ విధానాన్ని పాటించిన చైనా ఆ తర్వాత కరోనా ఆంక్షలు సడలించి, లాక్‌డౌన్లు ఎత్తివేసింది. దీంతో వైరస్ మరింతగా చెలరేగిపోయిందని అధికారులు చెప్తున్నారు.