Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హ్యారీ రాసిన ఆత్మకథ.. 17 ఏళ్ల వయసులో కన్యత్వాన్ని కోల్పోయాను..

Advertiesment
Prince Harry
, మంగళవారం, 10 జనవరి 2023 (22:55 IST)
ఇంగ్లండ్ యువరాజు హ్యారీ రాసిన ఆత్మకథలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా.. 17 ఏళ్ల వయసులో తనకంటే పెద్దదైన మహిళతో కన్యత్వాన్ని కోల్పోయినట్లు తెలిపారు. పలుమార్లు డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా రాశారు. 
 
ఇంగ్లండ్‌లో, 18 ఏళ్లలోపు వారితో లైంగిక సంబంధం కలిగి ఉండటం నేరం, కాబట్టి ప్రిన్స్ హ్యారీతో రొమాన్స్ చేసిన 17 ఏళ్ల అమ్మాయిని నేరస్థురాలిగా పరిగణిస్తారు. దీంతో నెటిజన్లు బాలిక ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. 
 
ఇంకా తన తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోవద్దని చెప్పినా ఆయన వినలేదని తన పుస్తకంలో పేర్కొన్నారు. తన తల్లి ప్రిన్సెస్ డయానా మరణం తనను తీవ్ర వేదనకు గురి చేసిందని కూడా పుస్తకంలో తెలిపారు. 
 
ప్రిన్స్ హ్యారీ మెమోయిర్ స్పేర్ అనే ఈ ఆత్మకథ కోసం వెతుకులాటలు పెరుగుతున్నాయి. హ్యారీ గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రపంచ ప్రజల్లో ఏర్పడింది. ఈ ఉత్సుకతే హ్యారీ పుస్తకం భారీగా అమ్ముడుబోయేందుకు కారణం అవుతోంది. 
 
గూగుల్ ట్రెండ్స్ ప్రకారం, "ప్రిన్స్ హ్యారీ మెమోయిర్", "ఆర్డర్ స్పేర్" కోసం శోధనలు ఈ వారం 200% కంటే ఎక్కువ పెరిగాయి. అయితే పుస్తకం దాని అసలు విడుదల తేదీకి కొన్ని రోజుల ముందు అమెజాన్ బెస్ట్ సెల్లర్స్ జాబితాలో ఈ పుస్తకం అగ్రస్థానానికి చేరుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గడ్డకట్టిన మంచులో న్యూడుల్స్ తిన్నాడు.. వీడియో వైరల్