Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎయిరిండియాలో ఉద్యోగాలు : నో రిటన్ టెస్ట్.. ఓన్లీ వాక్ ఇన్ ఇంటర్వ్యూ

Advertiesment
Air India Recruitment 2019
, గురువారం, 7 ఫిబ్రవరి 2019 (13:05 IST)
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థల్లో ఒకటైన ఎయిరిండియాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్టు సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఖాళీగా ఉన్న పోస్టులను వాక్‌ఇన్ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనుంది. 
 
భర్తీ చేయనున్న పోస్టుల్లో నాలుగు జూనియర్ ఎగ్జిక్యూటివ్, 150 కస్టమర్ ఏజెంట్స్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల కాలపరిమితి మూడేళ్లు. ఈ ఉద్యోగాల్లో అభ్యర్థుల విద్యార్హత సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగివుండి 28 యేళ్లలోపువారై ఉండాలి. వీరికి గ్రూపు డిస్కషన్స్, స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
 
ఇంటర్వ్యూలను ఈనెల 17, 18 తేదీల్లో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు బిల్డింగ్, ఎర్నాకుళంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం ఎయిరిండియా డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌ను చూడొచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లుడిపై మోజు : గాఢనిద్రలో ఉన్న భర్తను ప్రియుడితో కొట్టి చంపించిన భార్య