Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూపీఎస్సీ మెయిన్స్ 2024 ఫలితాలు వెల్లడి

Advertiesment
UPSC

ఠాగూర్

, మంగళవారం, 10 డిశెంబరు 2024 (09:31 IST)
అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సోమవారం విడుదల చేసింది. మెయిన్స్ పరీక్ష రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ఇంటర్వ్యూ అర్హత సాధించిన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లతో జాబితాను విడుదల చేసింది.
 
ఈ యేడాది మొత్తం 1056 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ గతంలో నోటిపికేషన్ జారీ చేసిన విషయం తెల్సిందే. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి జులై ఒకటో తేదీన ఫలితాలు వెల్లడించారు. ఆ తర్వాత ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి సెప్టెంబరు 20 నుంచి 29వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించింది. తాజాగా ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. త్వరలో నిర్వహించే ఇంటర్వ్యూలో సత్తా చాటిన వారిని ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర (గ్రూప్ ఏ, గ్రూప్ బీ) సర్వీసులకు ఎంపిక చేస్తారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే 'వన్ నేషన్ - వన్ ఎలక్షన్'