Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేన్ స్టేట్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో తమ కార్యకలాపాలను విస్తరించిన కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ

Advertiesment
image

ఐవీఆర్

, సోమవారం, 17 మార్చి 2025 (22:12 IST)
ఉమ్మడి పరిశోధన, విద్యా మార్పిడి కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విద్యా సహకారానికి తమ నిబద్ధతను మరింతగా పెంచుకుంటూ కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, యుఎస్ఏ లోని వేన్ స్టేట్ యూనివర్సిటీతో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది. ఈ ఒప్పందం అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో, విద్యార్థులు, అధ్యాపకులకు విద్యా అవకాశాలను పెంచడంలో మరో ముందడుగును సూచిస్తుంది.
 
విద్యా నైపుణ్యం, పరిశోధన సహకారం కోసం ఉమ్మడి దృక్పథాన్ని బలోపేతం చేస్తూ, కెఎల్ డీమ్డ్-టు-బి యూనివర్సిటీ, వేన్ స్టేట్ యూనివర్సిటీ ప్రతినిధుల మధ్య ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. మెకానికల్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ నబిల్ చల్హౌబ్, వేన్ స్టేట్ యూనివర్శిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ లీలా మోహన్ రెడ్డి కూడా విద్యా వృద్ధి, ఆవిష్కరణలకు పరస్పర అవకాశాలను అన్వేషించడానికి చర్చలలో పాల్గొన్నారు.
 
ఈ భాగస్వామ్యం రెండు విశ్వవిద్యాలయాలలోని విద్యార్థులకు విద్యా అనుభవాన్ని మెరుగుపరచడానికి, సంస్థల మధ్య బలమైన సంబంధాన్ని పెంపొందించడానికి రూపొందించబడింది. ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులు, విద్యా మార్పిడిలలో పాల్గొనడం ద్వారా, విద్యార్థులు తమ తమ రంగాలలో విలువైన నైపుణ్యాలు, జ్ఞానాన్ని పొంది, ప్రపంచ కెరీర్ అవకాశాలకు సన్నద్ధం కాగలరు. అదనంగా, కెఎల్ విద్యార్థులు వేన్ స్టేట్ యూనివర్సిటీలో తమ చదువును కొనసాగించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా, వేన్ స్టేట్ యూనివర్సిటీ విద్యార్థులు కెఎల్ యూనివర్సిటీలో విద్యా మార్పిడి కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ఈ భాగస్వామ్యం కోసం రెండు సంస్థలు కార్యాచరణను ఖరారు చేశాయి, ఇది వచ్చే సెమిస్టర్ నుండి అమలు చేయబడుతుందని భావిస్తున్నారు.
 
"ఈ సందర్శన మా అధ్యాపకులు, విద్యార్థుల పరిశోధన సామర్థ్యాలను, మేధో వృద్ధిని గణనీయంగా సుసంపన్నం చేసింది. ఈ చర్చలు వివిధ పరిశోధనా రంగాలలో వేన్ స్టేట్ యూనివర్సిటీ యొక్క నైపుణ్యం గురించి విలువైన పరిజ్ఙానంను అందించాయి, బహుళ విభాగాలలో బలమైన సహకార పరిశోధన భాగస్వామ్యానికి మార్గం సుగమం చేశాయి" అని కెఎల్ డీమ్డ్-టు-బి యూనివర్సిటీ(కెఎల్ఇఎఫ్)లో అంతర్జాతీయ సంబంధాల డీన్ డాక్టర్ ఎం. కిషోర్ బాబు అన్నారు.
 
చర్చల తరువాత, వేన్ స్టేట్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించింది, ఉన్నత విద్యా అవకాశాలు, కొత్త ప్రపంచ విద్యా ధోరణులు, అమెరికాలో కెరీర్ ప్రణాళికలపై మార్గదర్శకత్వం అందించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

AP Assembly Photo Shoot: పవన్ గారూ ఫ్రెష్‌గా వున్నారు.. ఫోటో షూట్‌కు హాజరుకండి: ఆర్ఆర్ఆర్