Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐఐటీఎంలో ఉద్యోగ అవకాశాలు.. చివరి తేదీ ఫిబ్రవరి 10

Advertiesment
ఐఐటీఎంలో ఉద్యోగ అవకాశాలు.. చివరి తేదీ ఫిబ్రవరి 10
, సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (11:46 IST)
చెన్నైలోని మద్రాస్ ఐఐటీలో తాత్కాలిక ప్రాతిపదికన కొన్ని రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 49 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ప్రాజెక్టు అసోసియేట్, ప్రాజెక్టు ఆఫీసర్, జూనియర్ టెక్నీషియన్, మేనేజర్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు.. ముందస్తు అనుభవం ఉండాలని ఐఐటీఎం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ పోస్టుల భర్తీలో షార్ట్ లిస్టింగ్, టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేయనున్నారు. దరఖాస్తులను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఈనెల 10వ తేదీలోపు పంపించాల్సివుంటుంది. పూర్తి వివరాల కోసం ఐఐటీఎం డాట్ ఏసీ డాట్ ఐఎన్ అనే వెబ్‌సైట్‌లో చూడొచ్చ. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్యోగాల పండగే, 2.62 ఉద్యోగాలు, ఏయే శాఖల్లోనో తెలుసా?