Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జెఈఈ మెయిన్స్‌ 2025లో తెలంగాణ రాష్ట్ర టాపర్‌గా నిలిచిన ఆకాష్ విద్యార్థి హార్ష్ ఎ. గుప్తా

Advertiesment
Akash Students

ఐవీఆర్

, శనివారం, 19 ఏప్రియల్ 2025 (18:17 IST)
హైదరాబాద్: టెస్ట్ ప్రిపరేటరీ సేవలలో జాతీయ అగ్రగామి అయిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) ఇటీవల జరిగిన జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జెఈఈ) 2025 మెయిన్స్‌లో అసాధారణ ప్రతిభను తమ విద్యార్థులు చూపారని వెల్లడించింది. 100  పర్సంటైల్‌ సాధించి  హైదరాబాద్‌కు చెందిన హార్ష్ ఏ గుప్తా తెలంగాణ రాష్ట్ర టాపర్‌గా నిలిచాడు. 
 
అతనితో పాటుగా కొత్త ధనుష్ రెడ్డి 99.99 పర్సంటైల్‌‌తో ఆల్ ఇండియా ర్యాంక్ 179, సంహిత పోలాడి 99.98 పర్సంటైల్‌‌తో ఆల్ ఇండియా ర్యాంక్ 203, రాఘవన్ ఏపూరి 99.97 పర్సంటైల్‌‌తో ఆల్ ఇండియా ర్యాంక్ 417, భరత్ నాయుడు కిలారి 99.95 పర్సంటైల్‌‌తో ఆల్ ఇండియా ర్యాంక్ 821 సాధించి తల్లిదండ్రులతో పాటుగా ఇనిస్టిట్యూట్‌కు గర్వకారణంగా నిలిచారు. ప్రపంచంలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షగా భావిస్తోన్న ఐఐటీ జెఈఈలో వీరు సాధించిన విజయం వారు పడిన కష్టం, చూపిన అంకిత భావంకు నిదర్శనం. వీరు ఆకాష్‌ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్‌లో శిక్షణ తీసుకున్నారు.   
 
విద్యార్థులను అభినందించిన ఆకాష్‌ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్‌ అకడమిక్ అండ్ బిజినెస్ హెడ్ శ్రీ ధీరజ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ, ‘‘విద్యార్థులు పడిన కష్టం, అంకితభావంతో పాటుగా సరైన కోచింగ్‌తో వీరు అసాధారణ ఫలితాలను సాధించారు. ఆకాష్ వద్ద మేము ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించటంపై దృష్టి సారిస్తున్నాము. తద్వారా వారు తమ పూర్తి సామర్ధ్యం చేరుకోగలరు. విజయం సాధించిన ప్రతి విద్యార్థిని అభినందిస్తున్నాను. భవిష్యత్‌లో వారు మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)