Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షియోమి నుంచి రానున్న సరికొత్త ఇ-బైక్

Advertiesment
Xiaomi Himo T1 electric
, గురువారం, 25 ఏప్రియల్ 2019 (15:53 IST)
చైనాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షియోమి తాజాగా సరికొత్త ఎలక్ట్రిక్ బైసైకిల్‌‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. హిమో బ్రాండ్ పేరుతో దీన్ని ఆవిష్కరించింది. దీని పేరు హిమో టీ1. 
 
ఈ బైసైకిల్‌లో 90ఎంఎం వెడల్పైన టైర్లు, వన్ బటన్ స్టార్ట్, మల్టీ కాంబినేషన్ స్విచ్, డిజిటల్ డిస్‌ప్లే వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ బైసైకిల్ ధర దాదాపు రూ.30,700గా ఉంది. చైనా మార్కెట్‌లో వీటి విక్రయాలు జూన్ 4 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. దీని బరువు 53 కేజీలు. రెడ్, గ్రే, వైట్ రంగుల్లో ఇది అందుబాటులోకి రానుంది.
 
షియోమి హిమో టీ1 బైసైకిల్‌లో లిథియమ్ అయాన్ బ్యాటరీని అమర్చారు. దీని కెపాసిటీ 14,000 ఎంఏహెచ్. వోల్టేజ్ 48వీ. 14ఏహెచ్, 28ఏహెచ్ ఎనర్జీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. 14ఏహెచ్ ఆప్షన్‌తో ఈ ఎలక్ట్రిక్ బైసైకిల్ 60 కిలోమీటర్లు వెళ్తుంది. అదే 28 ఏహెచ్ ఆప్షన్‌తో అయితే 120 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీరు చెప్పినట్లు ఓటు వేస్తేనే భర్తలకు తిండిపెట్టండి.. లేకుంటే అది కట్?