Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిలయన్స్ రిటైల్ అదుర్స్.. వోకల్ ఫర్ లోకల్ సక్సెస్.. ఎలాగంటే?

Advertiesment
Vocal for Local
, సోమవారం, 23 నవంబరు 2020 (21:17 IST)
Vocal for Local
రిలయన్స్ రిటైల్ సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 'వోకల్ ఫర్ లోకల్' మిషన్‌లో భాగంగా స్థానిక శిల్పకళా ఉత్పత్తులను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పండుగల సీజన్ సందర్భంగా 50కి పైగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) క్లస్టర్ల నుంచి 40వేలకు పైగా స్థానిక కళలు, చేనేత ఉత్పత్తులను తన కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.
 
అంతేగాకుండా.. 'ఇండీ బై అజియో', 'స్వదేశ్' పేరుతో చేపట్టిన కార్యక్రమాల ద్వారా... ప్రస్తుతం ప్రత్యక్షంగా 30 వేల మంది చేతివృత్తి కళాకారులకు లబ్ధి చేకూరుతోందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వస్త్రాలు, చేతికళలు, చేతివృత్తులతో తయారైన సహజమైన వస్తువులు సహా దాదాపు 600 రకాల చేతివృత్తి కళలలకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఆన్‌లైన్ ద్వారా స్థానిక చేతివృత్తులు, శిల్పకళా ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు రిలయన్స్ రిటైల్ సంస్థ 'ఇండీ బై అజియో'ను ప్రారంభించింది. దేశంలోని ప్రఖ్యాత సంప్రదాయక చేనేత వస్త్రాలకు కూడా ఇందులో స్థానం కల్పించారు.
 
గత కొన్నేళ్ల పాటు తాము ప్రారంభించిన చేతివృత్తి అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుతం మంచి ఫలితాలను ఇస్తున్నట్లు రిలయన్స్ రిటైల్ అండ్ లైఫ్‌స్టైల్ ప్రెసిడెంట్ అఖిలేశ్ ప్రసాద్ చెప్పారు. పెద్ద సంఖ్యలో చేతివృత్తి కళాకారులకు ఇందులో భాగస్వామ్యం కల్పించడంతో పాటు... మా ఆధ్వర్యంలో రూపొందించిన ఉత్పత్తులను వినియోగదారులు అంగీకరించేలా తీసుకెళ్లగలిగామని ఆయన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనీ నుంచి SEL2860 జూమ్ లెన్స్‌తో ప్రపంచం లోనే చిన్నది, తేలికైన ఫుల్-ఫ్రేమ్ కెమెరా సిస్టమ్ ఆల్ఫా 7C