Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రుణ గ్రహీతలకు శుభవార్త ... చక్రవడ్డీ చెల్లింపునకు కేంద్ర మంత్రివర్గం ఓకే..

Advertiesment
Union Cabinet
, బుధవారం, 21 అక్టోబరు 2020 (19:00 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం లాక్డౌన్ అమలు చేయడం జరిగింది. ఈ లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు. ఇలా ఉపాధిని కోల్పోయినవారు తాము తీసుకున్న రుణాలకు నెరవారీ పద్దులు (ఈఎంఐ)లు చెల్లించలేకపోయారు. దీంతో కేంద్రం ఈఎంఐల చెల్లింపులపై తొలుత మూడు నెలలు, ఆ తర్వాత మరో మూడు నెలలు కలిపి మొత్తం ఆర్నెల్ల పాటు మారటోరియం విధించింది. అయితే, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు మాత్రం ఈ ఆర్నెల్ల కాలానికి వడ్డీలతో పాటు.. చక్రవడ్డీలను వసూలు చేశాయి. ఇపుడు ఈ చక్రవడ్డీని చెల్లించేందుకు కేంద్ర మంత్రివర్గం సమ్మతం తెలిపింది. 
 
బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్టు సమాచారం. ఈ చెల్లింపు గురించి కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం వెల్లడించనున్నది. అయితే ఈఎంఐలపై బ్యాంకులు విధించే సాధారణ వడ్డీ, మారటోరియం కాలంలో విధించిన చక్రవడ్డీ మధ్య వ్యత్యాసాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెల్లించనున్నట్లు సమాచారం. 
 
కరోనా నేపథ్యంలో లాక్డౌన్‌ కారణంగా అన్ని రుణాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఆరు నెలలపాటు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు అమలులో ఉన్న ఈ మారటోరియం అవకాశాన్ని వినియోగించుకున్నవారు వడ్డీపై వడ్డీ (చక్ర వడ్డీ) చెల్లించాలని అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు స్పష్టం చేశాయి. 
 
ఈ నేపథ్యంలో కొందరు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వడ్డీపై వడ్డీ వసూలు చేయడం అన్యాయమని, దీనిని మాఫీ చేయాలని కోరారు. చివరకు కేంద్రం దీనికి అంగీకరించింది. రూ.2 కోట్ల వరకు రుణాలు తీసుకున్న ఈఎంఐలపై అదనపు వడ్డీ భారాన్ని తామే భరిస్తామని సుప్రీంకోర్టుకు చెప్పింది. అయితే దీని అమలుకు సంబంధించిన విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు ఒక నెల గడువు కోరింది. 
 
ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ అంశంపై చర్చించడంతోపాటు అదనపు వడ్డీ భారాన్ని చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మారటోరియం కేసు తదుపరి విచారణలో సుప్రీంకోర్టుకు ఈ విషయాన్ని వెల్లడించనున్నది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ శానిటైజ్డ్‌ బిఫోర్‌ యువర్‌ ఐస్‌ ప్రచారానికి ముఖచిత్రంగా సోనూసూద్