Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇకపై డిగ్రీ నుంచి పీహెచ్‌డీ : హెచ్ఆర్డీ శాఖ పేరు మార్పు...

ఇకపై డిగ్రీ నుంచి పీహెచ్‌డీ : హెచ్ఆర్డీ శాఖ పేరు మార్పు...
, బుధవారం, 29 జులై 2020 (18:48 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పిలుస్తూ వచ్చిన మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేరును మార్పు చేశారు. ఇకపై ఈ శాఖను విద్యా మంత్రిత్వ శాఖగా పిలుస్తారు. అలాగే, జాతీయ స్థాయిలో ఉన్నత విద్యలో ప్రధాన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా, జాతీయ నూతన విద్యా విధానం - 2020కి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్రవేసింది. 
 
ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ వెల్లడించారు. 21వ శాతాబ్దపు జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందన్నారు. 21వ శాతాబ్దానికి నూతన విధానానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యతన జరిగిన సమావేశంలో ఆమోద్ర వేసినట్లు చెప్పారు. 34 ఏళ్లుగా విద్యా విధానంలో ఎలాంటి మార్పులు జరుగలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. దీన్ని మొత్తం సమాజం, దేశం, ప్రపంచ విద్యావేత్తలు స్వాగతిస్తారని విశ్వసిస్తున్నట్లు వెల్లడించారు. 
 
ఇది చరిత్రాత్మకమైన రోజని, 34 ఏళ్ల తర్వాత దేశంలో నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) వచ్చిందన్నారు. 'నూతన విద్యా విధానం, సంస్కరణల అనంతరం 2035 నాటికి 50 శాతం స్థూల ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌)ను సాధిస్తామన్నారు. ఎన్ఈపీలో సంస్థల కోసం గ్రేడింగ్‌ చేయబడ్డ విద్యా, అడ్మినిస్ట్రేటివ్‌, ఫైనాన్షియల్‌ స్వయం ప్రతిపత్తి, ఉన్నత కోసం ఒకే రెగ్యులేటర్‌, అనేక 'తనిఖీల' స్థానంలో అనుమతుల కోసం స్వీయ వెల్లడి ఆధారిత పారదర్శక వ్యవస్థ కింద పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
 
అంతేకాకుండా, ఇకపై ఆర్బీఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ సారథ్యంలో ఏర్పాటైన కమిటీ సూచన మేరకు హెచ్ఆర్డీ శాఖ పేరున జాతీయ విద్యా మంత్రిత్వ శాఖగా మార్పు చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా, ఇకపై డిగ్రీ చేశాక పీజీ చేయకుండానే నేరుగా పీహెచ్‌డీ చేసే వెసులుబాటును కల్పించారు. ఈ నిర్ణయంతో అనేక మంది విద్యార్థులు నేరుగా పీహెచ్‌డీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోసాలకు చెక్.. అమేజాన్ నుంచి ఫ్రాడ్ డిటెక్టర్‌ వచ్చేసింది..