Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోడీ కలల ప్రాజెక్టు 'ఉడాన్' వచ్చేస్తోంది... గంట విమాన జర్నీకి రూ.2,500

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టు మరొకటి కార్యరూపం దాల్చనుంది. దేశంలో విమానాశ్రయాలు అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాలకు తక్కువ ధరకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేలా 'ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్

Advertiesment
UDAN Scheme
, శనివారం, 22 అక్టోబరు 2016 (15:03 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టు మరొకటి కార్యరూపం దాల్చనుంది. దేశంలో విమానాశ్రయాలు అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాలకు తక్కువ ధరకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేలా 'ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్' (ఉడాన్) అనే పథకానికి మోడీ సర్కారు రూపకల్పన చేయగా, ఇది త్వరలోనే సాకారం కానుంది. 
 
ఈ స్కీమ్ కింద గంట పాటు సాగే విమాన ప్రయాణానికి రూ.2500 మాత్రమే వసూలు చేస్తారు. అంతేకాకుండా, విమానంలోని సీట్లలో కనీసం 50 శాతం సీట్లను ఉడాన్ స్కీమ్ కింద విక్రయించాల్సి వుంటుంది. మిగిలిన సీట్లు మార్కెట్ ఆధారిత ధరల విధానంలో విక్రయించుకోవచ్చు. ఈ తరహా స్కీమ్ రూపకల్పన కావడం ప్రపంచ విమానయాన రంగంలో ఇదే తొలిసారి. 
 
ఈ స్కీములో ప్రభుత్వం ప్రతిపాదించిన వివరాల ప్రకారం... ఉడాన్ గురించి తాము ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు. జనవరి 2017 నుంచి ఈ విధానం అమల్లోకి రానుందని వెల్లడించారు. మరో రెండు రోజుల్లో సుంకాల విషయమై గజెట్‌లో ముసాయిదా పూర్తి వివరాలు ప్రచురితమవుతాయని, ఆపై నెలాఖరులోగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వస్తుందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంగ్లండులోని మగ గుర్రానికి అదంటే చాలా ఇష్టమట!