Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంగ్లండ్‌లోని మగ గుర్రానికి అదంటే చాలా ఇష్టమట.. పక్కలో అది ఉంటేనే నిద్రపోతుందట!

టెడ్డీబేర్ అంటే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికీ ఇష్టమే... కానీ ఓ గుర్రం కూడా తనకు ఇష్టమైన టెడ్డీబేర్‌ లేకపోతే అస్సలు నిద్రపోదంటే నమ్ముతారా.. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. మూడేళ్లుగా ఆ గ

Advertiesment
horse
, శనివారం, 22 అక్టోబరు 2016 (14:55 IST)
టెడ్డీబేర్ అంటే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికీ ఇష్టమే. కానీ ఓ గుర్రం కూడా తనకు ఇష్టమైన టెడ్డీబేర్‌ లేకపోతే అస్సలు నిద్రపోదంటే నమ్ముతారా.. వినడానికి కాస్తంత విచిత్రంగా ఉన్నా ఇది నిజం. మూడేళ్లుగా ఆ గుర్రం టెడ్డీబేర్‌తోనే కాలం గడుపుతోంది. ఈ వివరాల్లోకి వెళితే... ఇంగ్లండ్‌లోని డార్ట్‌మూర్‌ నేషనల్‌ పార్క్‌లో బ్రీజ్‌ అనే మగ గుర్రం ఉంది. బ్రీజ్‌ పుట్టిన కొన్ని గంటలకే బ్రీజ్‌ని వదిలి తల్లి వెళ్లిపోయింది. 
 
అప్పట్నుంచి తల్లి ప్రేమకు దూరమైన బ్రీజ్‌ ఒంటరిగా గడిపేది. ఎప్పుడు దిగులుగా ఉండే ఆ గుర్రాన్ని మారె అండ్‌ ఫోల్‌ అనే అటవీ సిబ్బంది చేరదీశాడు. బ్రీజ్‌ ఎప్పుడూ దిగాలుగా ఉండటం గమనించిన సిబ్బంది దానికి బటన్స్‌ అనే పెద్ద టెడ్డీబేర్‌ను తోడుగా అందించాడు. అప్పటి నుంచి బ్రీజ్‌ బటన్స్‌తోనే పెరిగింది. అదిలేకుండా ఒక్క క్షణం కూడా ఉండదట. ఇంకా చెప్పాలంటే బటన్స్‌ లేకుండా బ్రీజ్ ఆహారం తీసుకోదట.. నిద్రపోదట. మూడేళ్లు వచ్చినా బ్రీజ్‌ బటన్స్‌ లేకుండా ఉండలేకపోతోంది. 
 
బ్రీజ్‌ని చూసి జూ నిర్వాహకులు, పర్యాటకులు అందరూ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ.. ఆప్యాయతలు మనుషులకే కాదు జంతువులకూ ఉంటాయని ఈ గుర్రం నిరూపించిందని వారంటున్నారు. తాజాగా జూ అధికారులు బ్రీజ్‌, బటన్స్‌ చిన్నప్పటి ఫొటోలు, ప్రస్తుత ఫొటోలు సోషల్‌ మీడియాలో పెట్టారు. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో చక్కెర్లు కొడుతోంది. వాటికి నెటిజన్ల నుండి మంచి స్పందన వస్తోంది. ట్వీట్లు, కామెంట్లతో నెటిజన్లు గుర్రం టెడ్డీబేర్‌ల చక్కని స్నేహాన్ని అభినందిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూటుగా మద్యంసేవించి మహిళ బ్యాగుపై మూత్రం పోసిన కొవ్వెక్కిన వ్యాపారి