దేశంలో మరోమారు బంగారం, వెండి ధరలు కొండెక్కాయి. ఒక రోజు తగ్గుతూ.. మరోరోజు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలుదార్లకు ఇది షాకింగ్‌గా వుంది. తాజాగా గురువారం కూడా పెరిగింది.
బంగారం కొనుగోలు చేసే వినియోగదారులు బంగారు ధరల వైపు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. అయితే వెండి ధర విషయానికొస్తే బంగారం పెరిగితే వెండి మాత్రం తగ్గుముఖం పట్టింది. తాజాగా సిల్వర్ ధర తగ్గింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో గురువారం ఉదయం నాటికి నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,850 ఉంది. అలాగే, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250 ఉంది.
ఇకపోతే, ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,970 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,970 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది.
తెలుగు రాష్ట్రాలా రాజధానుల్లో ఒకటైన హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ఉండగా, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ఉంది.