Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోల్‌కతాలో అధునాతన వాహన స్క్రాపింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్

Advertiesment
scrap center

ఐవీఆర్

, శుక్రవారం, 9 మే 2025 (22:28 IST)
కోల్‌కతా: భారతదేశ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారు టాటా మోటార్స్ ఈరోజు కోల్‌కతాలో తమ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ కేంద్రాన్ని (RVSF) ప్రారంభించింది. ఇది దేశవ్యాప్తంగా కంపెనీ ఎనిమిదవ ఆర్వీఎస్ఎఫ్ ప్రారంభాన్ని సూచిస్తుం ది. రీసైకిల్ విత్ రెస్పెక్ట్ అని పేరు పెట్టబడిన ఈ అత్యాధునిక కేంద్రం ఏటా 21,000 వరకు కాలం చెల్లింన వాహనాలను సుస్థిరంగా, సురక్షితంగా తొలగించేలా రూపొందించబడింది. ఆర్వీఎస్ఎఫ్‌ను టాటా మోటార్స్ భాగస్వామి సెల్లాడేల్ సినర్జీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. అన్ని బ్రాండ్ల ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతో పాటు ప్యాసింజర్, వాణిజ్య వాహనాల స్క్రాపింగ్‌ను నిర్వహించడానికి సన్నద్ధమైంది.
 
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ రవాణా మంత్రి శ్రీ స్నేహాశిష్ చక్రవర్తి, కోల్‌కతా మేయర్ శ్రీ ఫిర్హాద్ హకీ మ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాల మంత్రి శ్రీ ఫిర్హాద్ హకీమ్ వర్చువల్‌గా పాల్గొన్నారు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ రవాణా శాఖ కార్యదర్శి డాక్టర్ సౌమిత్ర మోహన్, టాటా మోటార్స్ కమర్షియల్ వెహికిల్స్-ట్రక్స్ వైస్ ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్ శ్రీ రాజేష్ కౌల్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, టాటా మోటార్స్ నుండి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కంపెనీ ఇప్పుడు జైపుర్, భువనేశ్వర్, సూరత్, చండీగఢ్, దిల్లీ ఎన్సీఆర్,  పుణె, గువాహటిలలో రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపేజ్ కేంద్రాలను నిర్వహిస్తోంది. కోల్‌ కతా కేంద్రం తూర్పు భారతదేశంలో మూడవ Re.Wi.Re. ఇది ఈ ప్రాంతంలోని వినియోగదారులకు మెరుగైన ప్రాప్యతను అందిస్తుంది.
 
ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ రవాణా మంత్రి శ్రీ స్నేహశిష్ చక్రవర్తి మాట్లాడుతూ, ‘‘టాటా మోటార్స్ Re.Wi. Re ప్రారంభం మన ప్రజలకు పరిశుభ్రమైన, మరింత సమర్థవంతమైన భవిష్యత్తును నిర్మించే దిశగా స్వాగతించదగిన అడుగు. ఈ కార్యక్రమం కొత్త, సురక్షితమైన ఇంధన-సమర్థవంతమైన వాహనాలను స్వీకరించడానికి, రవాణా రంగంలో వృత్తాకార ఆర్థిక అవకాశాలను సృష్టించడానికి కూడా తోడ్పడుతుంది. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రానికి తీసుకువచ్చినందుకు టాటా మోటార్స్, సెల్లాడేల్ సినర్జీలు, పాల్గొన్న భాగస్వాములందరినీ మేంఅభినందిస్తున్నాం’’ అని అన్నారు.
 
కోల్‌కతా మేయర్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ పట్టణాభివృద్ధి- మునిసిపల్ వ్యవహారాల మంత్రి శ్రీ ఫిర్హాద్ హకీమ్ మాట్లాడుతూ, "టాటా మోటార్స్ వారి ఆర్వీఎస్ఎఫ్‌ ప్రారంభం సుస్థిర అభివృద్ధి వైపు ఒక అర్ధవంతమైన అడుగును ప్రతిబింబిస్తుంది. మన రాష్ట్రంలో పర్యావరణ భారాన్ని తగ్గించడానికి, మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ కేంద్రం రాష్ట్రానికి విలు వైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. మన రాష్ట్ర ప్రజల కోసం ఈ ముందుచూపుతో కూడిన అడుగు వేసినందుకు టాటా మోటార్స్‌ను మేం అభినందిస్తున్నాం’’ అని అన్నారు.
 
ఈ సందర్భంగా టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ ట్రక్స్ వైస్ ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్ శ్రీ రాజేష్ కౌల్ మాట్లాడుతూ, "టాటా మోటార్స్ వృత్తాకార ఆర్థిక వ్యవస్థను పెంపొందించుకుంటూ సుస్థిర చలనశీలత పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంది. పశ్చిమ బెంగాల్‌లో మొట్టమొదటి Re.Wi.Re, దేశంలోని ఎనిమిదవ కేంద్రం ప్రారంభోత్సవం మా వాహన స్క్రాపింగ్ ఆవరణ వ్యవస్థను విస్తరించడంలో ఒక ముఖ్యమైన అడుగు. ఎనిమిది టాటా మోటార్స్ ఆర్వీఎస్ఎఫ్‌లలో ఏటా 1.3 లక్షలకు పైగా వాహనాలను కూల్చివేసే సంచిత సామర్థ్యంతో, భద్రత, అనుగుణ్యత, సుస్థిరత్వంపై దృష్టి సారించి భారతదేశ వాహన స్క్రాపింగ్ పర్యావరణ వ్యవస్థను మార్చడంలో మేం నాయకత్వం వహిస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత