అగ్రో-కెమికల్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న బెస్ట్ ఆగ్రోలైఫ్, చీరాల రీజియన్ (ఆంధ్రప్రదేశ్) పొన్నూరు టెరిటరీలో అత్యంత విజయవంతమైన మెగా ఫార్మర్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 230 మంది రైతులు హాజరయ్యారు. మెరుగైన ఉత్పాదకత కోసం పంటల నమూనాలను ఆప్టిమైజ్ చేయడం ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం. ప్రధానంగా 40-45 DAS దశలో మినుములు(35%), పెసలు(20%), వేరుశనగ(25%), పచ్చి మిరపకాయ (20%) మిశ్రమాన్ని చర్చించారు.
రాన్‌ఫెన్, క్యూబాక్స్ పవర్, ట్రైకలర్, సిటీజెన్, ఇర్మా, రిచ్ గ్రో వంటి ఫోకస్ ఉత్పత్తులపై ప్రదర్శనలు ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణలు. శ్రీ రాయుడు, రీజినల్ సేల్స్ మేనేజర్, బెస్ట్ ఆగ్రోలైఫ్ కంపెనీ వారసత్వం- దాని ఉత్పత్తులను గురించి వివరించారు. అదే సమయంలో, సాంకేతిక ప్రదర్శనకు ఎఫ్‌ఎంఎం శ్రీ గొట్టిపాటి రవీంద్రనాధ్ నాయకత్వం వహించారు.
"యాజలి ఎఫ్‌పిఓ- పొన్నూరు టెరిటరీలో మెగా ఫార్మర్ మీట్ అఖండ విజయం సాధించినందుకు మేము సంతోషిస్తున్నాము. వ్యవసాయ సంఘంలో సహకారం- ఆవిష్కరణలను పెంపొందించడంలో మా అంకితభావాన్ని ఈ కార్యక్రమం ఉదహరించింది. ఈ ప్రాంతం యొక్క వ్యవసాయ వృద్ధి, శ్రేయస్సుకు తోడ్పడటానికి ఎదురుచూస్తున్నాము," అని బెస్ట్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్ నేషనల్ మార్కెటింగ్ మేనేజర్ సారా నర్సయ్య చెప్పారు.
మార్కాపూర్‌కి చెందిన రీజినల్ సేల్స్ మేనేజర్ శ్రీ ఎమ్ఎన్‌బి చారి, మిరప పంటలో రాన్‌ఫెన్+క్యూబాక్స్ పవర్ యొక్క అద్భుతమైన విజయగాథను పంచుకున్నారు, దిగుబడి- నాణ్యతను పెంచడంలో ఈ ఉత్పత్తుల యొక్క సమర్థతను నొక్కిచెప్పారు. యాజలి ఎఫ్‌పిఓ చైర్మన్ శ్రీ నరసింహా ప్రదర్శించిన ఉత్పత్తుల నాణ్యతను మెచ్చుకుంటూ వాటితో తన అనుభవాలను పంచుకున్నారు.
మెగా ఫార్మర్ మీట్‌లో పాల్గొన్నవారిలో శ్రీ రాయుడు, శ్రీ గొట్టిపాటి రవీంద్రనాధ్, శ్రీ ఎమ్ఎన్‌బి చారి, శ్రీ ఎం లక్ష్మీ నారాయణ, శ్రీమన్నారాయణ తదితరులు ఈవెంట్ విజయవంతానికి సమిష్టిగా సహకరించారు.