Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇండియా- ఆసియా ఫసిఫిక్‌ ప్రాంతాల కోసం స్టెల్లాంటిస్‌ ముఖ్యమైన నాయకత్వ బృంద నియామకాలు

ఇండియా- ఆసియా ఫసిఫిక్‌ ప్రాంతాల కోసం స్టెల్లాంటిస్‌ ముఖ్యమైన నాయకత్వ బృంద నియామకాలు
, మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (21:52 IST)
స్టెల్లాంటిస్‌ ఇండియా అండ్‌ ఆసియా పసిఫిక్‌  నేడు భారతదేశంతో పాటుగా ఆసియా పసిఫిక్‌ ప్రాంతాలలో తమ కార్యకలాపాల నిర్వహణ కోసం తమ ముఖ్య నాయకత్వ బృంద నియామకాలను వెల్లడించింది. భారతదేశంలో సంస్థ సీఈవో మరియు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా శ్రీ రోలాండ్‌ బౌచారాను నియమించింది. జీప్‌ మరియు సిట్రాన్‌ నేషనల్‌ సేల్స్‌ కంపెనీస్‌ (ఎన్‌ఎస్‌సీ)బాధ్యతలతో పాటుగా గ్రూప్‌ తయారీ కార్యక్రమాలకు సైతం ఆయన బాధ్యత వహిస్తారు.
 
సిట్రాన్‌ ఇండియా సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా 2017వ సంవత్సరం నుంచి రోలాండ్‌ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ ఆటోమోటివ్‌, కన్సల్టింగ్‌ వ్యాపారాలలో అపారమైన అనుభవం రోలాండ్‌ సొంతం. 2017లో గ్రూప్‌ పీఎస్‌ఏలో చేరక మునుపు రెనాల్ట్‌లో పలు కీలకమైన నాయకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. ఆ సంస్థలో మేనేజింగ్‌ డైరెక్టర్-యుకె; హెడ్‌ ఆఫ్‌ యూరోప్‌ ఎన్‌ఎస్‌సీ (జర్మనీ, యుకె, స్పెయిన్‌, ఇటలీ) మరియు ఎస్‌వీపీ సేల్స్‌అండ్‌ మార్కెటింగ్‌-ఆసియా పసిఫిక్‌ అండ్‌ చైనా స్థాయిలలో పనిచేశారు.
 
ఇండియా మరియు ఆసియా పసిఫిక్‌ ప్రాంతాలలో ఇంజినీరింగ్‌, డిజైన్‌, రీసెర్చ్‌, డెవలప్‌మెంట్‌ (ఆర్‌ అండ్‌ డీ) కార్యకలాపాలను డాక్టర్‌ పార్థ దత్తా పర్యవేక్షించనున్నారు. 2019వ సంవత్సరం నుంచి పార్థ, ఎఫ్‌సీఏ ఇండియాలో ప్రెసిడెంట్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వహిస్తూనే జీప్‌ కంపాస్‌, స్థానికంగా అసెంబెల్‌ చేసిన జీప్‌ వ్రాంగ్లర్‌ను విజయవంతంగా ఆవిష్కరించడంలో తోడ్పడ్డారు.
 
ఈ నియామకాలను నేడు స్టెల్లాంటిస్‌ ఇండియా అండ్‌ ఆసియా పసిఫిక్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ కార్ల్‌ స్మైలీ వెల్లడించారు. ‘‘రోలాండ్‌ మరియు పార్థలు నూతన బాధ్యతలను తక్షణమే చేపట్టనున్నారు. అంతర్జాతీయ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా అపారమైన వాణిజ్య అనుభవాన్ని భారతదేశంలో సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రోలాండ్‌ తీసుకురానున్నారు. స్టెల్లాంటిస్‌ బ్రాండ్ల విస్తరణ, నెట్‌వర్క్‌, వ్యాపార కార్యకలాపాల అభివృద్ధికి ఆయన బాధ్యత వహించనున్నారు.
 
ఈ ప్రాంతంలో స్టెల్లాంటిస్‌ ఇంజినీరింగ్‌, డిజైన్‌, ఆర్‌ అండ్‌ డీ కార్యకలాపాలకు దిశానిర్ధేశం చేసేందుకు  సృజనాత్మక, వినూత్నమైన ఉత్పత్తి అభివృద్ధి నైపుణ్యం కలిగిన డాక్టర్‌ పార్థ సరైన వ్యక్తి. భారతదేశంలో జీప్‌ బ్రాండ్‌ యొక్క స్ధానిక ఉత్పత్తి ప్రణాళికలో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు..’’ అని శ్రీ స్మైలీ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖలో దారుణం.. కరోనా బారిన పడి చిన్నారి మృతి