జియో ఇన్ఫోకామ్‌లోమరో 30 వేల కోట్లు కుమ్మరించనున్న ఆర్ఐఎల్
అభివృద్ధి, సిగ్నళ్ల బలోపేతానికి గాను జియో ఇన్ఫోకామ్‌లోక మరో రూ. 30,000 కోట్లను మదుపు చేయనున్నట్లు రిలయెన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఇటీవలే తన బోర్డు సమావేశం ఏర్పాటు చేసిన రిలయెన్స్ ఇండస్ట్రీస్ తన టెలికామ్ యూనిట్‌లోకి భారీ మొత్తంలో మదుపు చేయాలని, దీ
అభివృద్ధి, సిగ్నళ్ల బలోపేతానికి గాను జియో ఇన్ఫోకామ్‌లోక మరో రూ. 30,000 కోట్లను మదుపు చేయనున్నట్లు రిలయెన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఇటీవలే తన బోర్డు సమావేశం ఏర్పాటు చేసిన రిలయెన్స్ ఇండస్ట్రీస్ తన టెలికామ్ యూనిట్‌లోకి భారీ మొత్తంలో మదుపు చేయాలని, దీనికోసం 600 కోట్ల విలువైన ప్రాధాన్యతా షేర్లను అమ్మివేయనున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే ఆర్ఐఎల్ తన టెలికామ్ వెంచర్ జియో ఇన్ఫోకామ్‌లో లక్షా 71 కోట్ల రూపాయలను మదుపు చేసింది. 2016 సెప్టెంబర్ 5న ప్రారంభించిన నాటి నుంచి జియో మొత్తం 7 కోట్ల మంది యూజర్లను సంపాదించింది. సంస్థ ప్రకటించిన ఫ్రీ వాయిస్ కాల్స్, డేటా ప్లాన్ల ద్వారానే ఈ ఘనత సాధించడం విశేషం. ఇంత తక్కువ కాలంలో ఇంతమంది వినియోగదారులను సంపాదించిన చరిత్ర ప్రపంచంలోనే ఏ కంపెనీకి సాధ్యపడలేదు.
అయితే నెట్‌వర్క్ కవరేజ్, కాల్ డ్రాప్‌ల సమస్య కారణంగా కస్టమర్ల విశ్వాసం దెబ్బతింటోందని గమనించిన రిలయెన్స్ ఇండస్ట్రీస్ కొత్తగా మదుపు చేయనున్న 30 వేల కోట్లతో ఈ సమస్యను అధిగమించగలనని విశ్వాసంతో ఉంది. పైగా అతి త్వరలో కేవలం రూ.900 లకే జియో వోల్టే ఫీచర్ ఫోన్లను ప్రారంభిస్తానని కంపెనీ ప్రకటించడం పోటీ సంస్థలను వణికిస్తోంది.