'జల్లికట్టు' అలజడి... నటి త్రిష ట్విట్టర్ హ్యాక్.. కమల్ - రజినీ మద్దతు...
తమిళనాడు సంప్రదాయ గ్రామీణ సాహస క్రీడ జల్లికట్టు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ పోటీలను నిర్వహించలేని పరిస్థితి కారణం పెటా సంస్థ. ఈ సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను విచార
తమిళనాడు సంప్రదాయ గ్రామీణ సాహస క్రీడ జల్లికట్టు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ పోటీలను నిర్వహించలేని పరిస్థితి కారణం పెటా సంస్థ. ఈ సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. జల్లికట్టు పోటీల నిర్వహణపై నిషేధం విధించింది. అయిప్పటికీ.. జల్లికట్టు నిర్వహించాలని పెద్దఎత్తున ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో జంతు హక్కుల సంరక్షణ సంస్థ 'పెటా' ప్రచారకర్త, నటి త్రిషపై జల్లికట్టు మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆమె తన ట్విట్టర్‌ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జల్లికట్టు పోటీలు నిర్వహించలేక పోవడానికి పెటా సంస్థ కారణమంటూ ఆ సంస్థ ప్రచారకర్తగా ఉన్న త్రిషపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే త్రిష ఖాతాను తాము హ్యాక్ చేయలేదని, ఆమె డీయాక్టివేట్ చేసుకుందని జల్లికట్టు నిర్వాహకులు చెపుతున్నారు.
ఈ నేపథ్యంలో త్రిషపై వస్తున్న విమర్శలకు నటుడు కమల్ హాసన్ ఘాటుగా స్పందించారు. 'జల్లికట్టు' వ్యవహారంలో త్రిషను గాయపరిచేలా వ్యవహరించడం తగదన్నారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ జల్లికట్టుకు మద్దతు తెలిపారు. తమిళ సంస్కృతిలో ఓ భాగమైన జల్లికట్టుపై నిషేధం తగదన్నారు.