దేశ వ్యాప్తంగా అలాగే తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. అయితే..ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందుకు స్మార్ట్ ఫోన్ కంపల్సరీగా ఉపయోగించాల్సి ఉంటుంది.
అయితే ఇకపై ఇలాంటి ఇబ్బందులు అవసరం లేదని అధికారులు అంటున్నారు. సమీపంలో ఉన్న పోస్టాఫీస్‌కు వెళితే సరిపోతుందని చెప్తున్నారు. టీకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, స్లాట్ బుకింగ్ చేసుకొనే వారికి సహకరించాలని తాజాగా..పోస్టాఫీస్ శాఖాధికారులు నిర్ణయించారు. ఇందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం కరోనా టీకా తీసుకోవాల్సి ఉంటే.. కొవిన్ పోర్టులో కు వెళ్లి అక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపై పోస్టాఫీసుల్లో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ సేవలను కేంద్రం అనుమతించింది. దీనిని ప్రధాన మంత్రి నియోజకవర్గం వారణాసిలో దీనిని ప్రారంభించారు. అనంతరం దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులకు విస్తరించారు. తెలంగాణ రాష్ట్రంలోని 36 హెడ్ పోస్టాఫీసులు, 643 సబ్ హెడ్ పోస్టాఫీసులు, 810 బ్రాంచ్ పోస్టాఫీసుల్లో 2021, మే 31వ తేదీ సోమవారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేయనున్నాయి.
కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారు…తమ సమీప పోస్టాఫీసు కు వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, ఫోన్ తీసుకెళ్లాలి. దానికి వచ్చే OTPని నమోదు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఇక పోస్టాఫీసుకు వచ్చే వారు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.