Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాజ్‌పేయి స్మారకార్థం రూ.100 నాణెం.. రిలీజ్ చేసిన ప్రధాని మోడీ

Advertiesment
Narendra Modi
, సోమవారం, 24 డిశెంబరు 2018 (16:19 IST)
మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకార్థం రూ.100 నాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం రిలీజ్ చేశారు. వాజ్‌పేయి జయంతి వేడుకలకు ఒక రోజు ముందే ఈ నాణేంను విడుదల చేయడం గమనార్హం. 
 
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, 'అటల్‌జీ ఇక మనతో లేరన్న విషయాన్ని నమ్మేందుకు మనసు అంగీకరించడం లేదు. సమాజంలోని అన్ని వర్గాల నుంచి ప్రేమాభిమానాలు అందుకున్న అరుదైన నాయకుడాయన' అని కొనియాడారు. 
 
కాగా, ఈ నాణేనికి మాజీ ప్రధాని వాజ్‍పేయి చిత్రంతో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆయన పేరును ముద్రించారు. అలాగే, వాజ్‌పేయి చిత్రం కింద జనన మరణ సంవత్సరాలను కూడా చూడొచ్చు. మరోవైపు అశోక చక్రం, సత్యమేవ జయతే నినాదం, రూ.100 అంకెతో పాటు భారతదేశం పేరును హిందీ, ఇంగ్లీషులో ముద్రించారు. ఈ నాణెం బరువు 35 గ్రాములు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూ... ఇడియట్స్... పవన్ 'గ్లాసు' గురించి పరాచికాలా?