పిడిలైట్ ఇండస్ట్రీస్ నుండి ప్రముఖ టైల్స్ ఎడ్హెసివ్ బ్రాండ్ అయిన రాఫ్ హైదరాబాద్ సమీపంలోని జడ్చర్లలో తమ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈశాన్య కర్ణాటక మార్కెట్లలో అధిక నాణ్యత గల టైల్ ఎడ్హెసివ్ ఉత్పత్తుల కోసం పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి ఈ సదుపాయం తోడ్పడనుంది. పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ పూరి మాట్లాడుతూ, "ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్‌లలో ప్రీమియం, ప్రత్యేక ఉత్పత్తులకు డిమాండ్ పరంగా స్థిరమైన పెరుగుదలను మేము గమనించాము. టైల్, స్టోన్ ఫిక్సింగ్‌ను ఆధునీకరించాలనే మా లక్ష్యంకు అనుగుణంగా మా జడ్చర్ల ప్రాజెక్ట్ ఉంది. వినియోగదారులకు మేలైన ఎడ్హెసివ్ పదార్థాలను అందించడం, తయారీని మార్కెట్‌లకు చేరువ చేయడం మా లక్ష్యం" అని అన్నారు.
పిడిలైట్ ఇండస్ట్రీస్ యొక్క పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా, ఈ సదుపాయం జీరో-వేస్ట్ ప్లాంట్‌గా పనిచేస్తుంది. 80% సౌరశక్తితో నడుస్తుంది, నిర్మాణ రసాయనాల రంగంలో పర్యావరణ అనుకూల తయారీకి కొత్త ప్రమాణాలను ఏర్పరుస్తుంది. అధునాతన ఆటోమేషన్‌తో కూడిన ఈ ప్లాంట్ ఉత్పత్తిలో అధిక ఖచ్చితత్వం, స్థిరత్వం, నాణ్యత, సామర్థ్యాన్ని నిర్ధారిస్తుంది. దీని వ్యూహాత్మక స్థానం సరఫరా గొలుసు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, ప్రత్యేకమైన, అధిక-నాణ్యత కలిగిన టైల్ ఎడ్హెసివ్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీరుస్తుంది.
గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌గా, జడ్చర్ల కేంద్రం, పిడిలైట్ యొక్క దీర్ఘకాలిక వృద్ధి వ్యూహానికి అనుగుణంగా భవిష్యత్ విస్తరణకు విస్తృత అవకాశాలను అందిస్తుంది. 350 మందికి పైగా డీలర్లు, వినియోగదారులు హాజరైన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ సౌకర్యం అత్యాధునిక సాంకేతికత, స్థిరమైన అభ్యాసాలను ప్రదర్శించింది.