Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతదేశంలో గేమ్‌ ఛేంజర్‌గా మైక్రో ఏటీఎంగా రపీ పే

Advertiesment
భారతదేశంలో గేమ్‌ ఛేంజర్‌గా మైక్రో ఏటీఎంగా రపీ పే
, బుధవారం, 9 సెప్టెంబరు 2020 (17:12 IST)
భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్‌ కంపెనీ రపీ పే, వినియోగదారులకు బ్యాంకింగ్‌ వ్యాపార ప్రతినిధులు (బీసీలు) సేవలను అందించడం కోసం ఫ్రాంచైజ్డ్‌ రిటైల్‌ నెట్‌వర్క్‌ను వినియోగిస్తూ ఇటీవలనే దేశవ్యాప్తంగా మైక్రో ఏటీఎం(ఎంఏటీఎం)లను భారతదేశవ్యాప్తంగా ఆవిష్కరించింది.

క్యాపిటల్‌ ఇండియా ఫైనాన్స్‌ లిమిటెడ్‌(సీఐఎఫ్‌ఎల్‌)కు ఫిన్‌టెక్‌ అనుబంధ సంస్థ అయిన కంపెనీ, ఏటీఎం నగదు విత్‌డ్రాయల్స్‌ కోసం మైక్రో ఏటీఎంలు గేమ్‌ ఛేంజర్‌గా భారతీయ వినియోగదారుల నడుమ, మరీముఖ్యంగా టియర్‌ 2,3 పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల ప్రజల నడుమ నిలువనున్నట్లు నమ్ముతుంది. ముఖ్యంగా రపీపే యొక్క బీసీ నమూనా, ఆత్మనిర్బర్‌ భారత్‌ నిర్మాణంలో బలీయమైన పాత్రను పోషిస్తూ లక్షలాది మంది భారతీయ రిటైలర్లకు స్వీయసమృద్ధి అవకాశాలను సైతం అందించనుంది.
 
ఈ నూతన సేవలను ఆవిష్కరించిన సందర్భంగా శ్రీ యోగేంద్ర కశ్యప్‌, ఎండీ అండ్‌ సీఈవో, రపీపే మాట్లాడుతూ, ‘‘మార్కెట్‌లో మా మైక్రో ఏటీఎంలు అపూర్వమైన ఆదరణ పొందాయని వెల్లడించడానికి మేము సంతోషిస్తున్నాము. ఆవిష్కరించిన నెలలోపే మేము 25 వేల ఉపకరణాలను ఏర్పాటు చేశాము. రపీపే మైక్రో ఏటీఎంలు, సంప్రదాయ ఏటీఎంలతో పోలిస్తే విప్లవాత్మకమైనవి. ఇవి వినియోగదారులకు అతి సులభంగా నగదు విత్‌ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాయి. అంతేకాదు, ఏటీఎం కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా రపీ పే స్టోర్‌ ద్వారా బ్యాంకు ఏటీఎంలో ఏవిధంగా అయితే నగదు ఉపసంహరిస్తామో అలాగే చేయవచ్చు’’ అని అన్నారు.
 
మైక్రో ఏటీఎంలు, ఏఈపీఎస్‌ మరియు ఇతర సేవలు అయినటువంటి నగదు బదిలీ, బిల్‌ మరియు పన్ను చెల్లింపులు మొదలైనవి దగ్గరలోని షాప్‌ కీపర్‌ వద్ద లభించడం అనేది బ్యాంకింగ్‌ మరియు చెల్లింపు సేవల కోసం వెదికే వారికి అతిపెద్ద తోడ్పాటును అందించనున్నాయి’’ అని కశ్యప్‌ అన్నారు.
 
అత్యధిక నగదు లావాదేవీలను నిర్వహించే ప్రాంతాలలో ఒకటిగా ఇండియా ఉంది. లక్షలాది లావాదేవీలు ఇప్పటికే మైక్రో ఏటీఎంల ద్వారా జరిగాయి. అది ఆధార్‌ అనుసంధానిత చెల్లింపు వ్యవస్థ (ఏఈపీఎస్‌) లేదా మైక్రో ఏటీఎం ఉపకరణాల ద్వారా అయినా కావొచ్చు. ప్రస్తుత మహమ్మారి సమయంలో మరీ ముఖ్యంగా కార్మికులు, శ్రామికులు, రైతులు మొదలైన వారి జనధన్‌ ఖాతాలలో 1.75 లక్షల కోట్ల రూపాయలను పంపిణీ చేసిన తరువాత నగదు ఉపసంహరణకు ఈ మైక్రో ఏటీఎంలు తోడ్పడతాయి.
 
ఆర్‌బీఐ విడుదల చేసిన ఇటీవలి డాటాలో వెల్లడైన దాని ప్రకారం దేశంలో 2.2 లక్షల ఏటీఎంలలో కేవలం 19% ఏటీఎంలు మాత్రమే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. భారతదేశ జనాభాలో 62% మంది అక్కడే ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో అతి తక్కువగా విస్తరించడంతో పాటుగా ప్రతి సంవత్సరం ఈ ఏటీఎంల సంఖ్య తగ్గుతూనే ఉంది. ఈ కారణం చేతనే మైక్రో ఏటీఎంల కోసం అత్యధిక డిమాండ్‌ ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇది తగిన పరిష్కారం చూపడంతో పాటుగా వారి నగదు విత్‌డ్రాయల్‌ అవసరాలను సైతం తీర్చనుంది.
 
రపీ పే మైక్రో ఏటీఎంలు పూర్తి అందుబాటులో ఉంటాయి. రపీపే ఏజెంట్‌ యాప్‌తో అతి సులభంగా కనెక్ట్‌ అయి ఉంటుంది. భారతదేశవ్యాప్తంగా రపీపే సాథీస్‌ అంతా ఈ ఏజెంట్‌ యాప్‌ వినియోగిస్తున్నారు. ఆర్‌బీఐ నుంచి పీపీఐ(ప్రీపెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌)ను రపీ పే కలిగి ఉంది. ఇది పూర్తి సురక్షితం మరియు ఏజెంట్లతో పాటుగా వినియోగదారులకు సైతం ఆధారపడతగిన రీతిలో ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంజీలు తీస్తానంటున్న ముఖ్యమంత్రి... ఎందుకో తెలుసా?