Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2025 సంవత్సరానికి బడ్జెట్ లక్ష్యాలను ముందుకు తెచ్చిన ఎంఐసి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్

Advertiesment
Rakshit

ఐవీఆర్

, సోమవారం, 20 జనవరి 2025 (21:52 IST)
లెడ్ డిస్ప్లే, లైటింగ్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఉన్న MIC ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, రాబోయే కేంద్ర బడ్జెట్ 2025 పురస్కరించుకుని తమ అంచనాలను వివరించింది, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో వృద్ధి, ఆవిష్కరణలను పెంపొందించడానికి పరిశ్రమ-స్నేహపూర్వక విధానాల అవసరాన్ని నొక్కి చెప్పింది. కంపెనీ అంచనాల గురించి  MIC ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సీఈఓ శ్రీ రక్షిత్ మాథుర్ మాట్లాడుతూ, “భారతీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు 2025 కేంద్ర బడ్జెట్ కీలకమైన సమయంలో వస్తుంది. పర్యావరణ అనుకూలమైన, ఇంధన-సమర్థవంతమైన పరిష్కారాల దిశగా ప్రపంచం ప్రయాణిస్తోన్న వేళ, దేశీయ తయారీని బలోపేతం చేసే, ఆర్&డి కార్యక్రమాలను ప్రోత్సహించే రీతిలో ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టడం చాలా అవసరం. అవి ప్రపంచవ్యాప్తంగా పోటీ పడటానికి వీలు కల్పిస్తాయి” అని అన్నారు 
 
"ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రపంచ కేంద్రంగా తనను తాను భారతదేశం నిలబెట్టుకున్నందున, ఉత్పత్తి-అనుసంధానిత ప్రోత్సాహకం పథకానికి కేటాయింపులను పెంచడం, కీలకమైన ముడి పదార్థాలకు దిగుమతి సుంకాలను తగ్గించడం, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలలో పెట్టుబడి పెట్టడం వంటి విధానాలు చాలా కీలకం" అని శ్రీ మాథుర్ తెలిపారు. ఐఓటి, ఏఐ స్మార్ట్ లైటింగ్ సిస్టమ్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల (PPPs) ప్రాముఖ్యతను కూడా MIC ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్  హైలైట్ చేసింది. 
 
ఫిబ్రవరి 1న సమర్పించనున్న యూనియన్ బడ్జెట్ 2025 ద్వారా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక రంగంలో సవాళ్లు, అవకాశాలను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడటానికి పరిశ్రమ నాయకులు, వాటాదారులు ఆసక్తిగా ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరందూరు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కావాల్సిందే.. కానీ రైతులకు అండగా ఉంటాం...