Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాత్రికులు సరైన బస కోసం లవ్డ్ బై డివోటీస్‌ను ప్రారంభించిన మేక్ మైట్రిప్

Advertiesment
Make my Trip

ఐవీఆర్

, గురువారం, 6 ఫిబ్రవరి 2025 (19:37 IST)
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రయాణం ఎంతో అభివృద్ధిని చూసింది, యాత్రా గమ్యస్థానాలు ఇప్పుడు మేక్ మైట్రిప్ వారి మొత్తం గదుల రాత్రి బుక్కింగ్స్ Q3 ఆర్థిక సంవత్సరం 25లో 10% భాగస్వామం కలిగి ఉన్నాయి. ప్లాట్ ఫాంలో ఆధ్యాత్మికమైన గమ్యస్థానాల కోసం శోధనలు 2022తో పోల్చినప్పుడు 2024లో 46% పెరిగాయి, ఇది విశ్రాంత ప్రయాణాని కంటే విలక్షణంగా ఉండే ఎంతో అర్థవంతమైన, ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన ప్రయాణాల కోసం ప్రయాణికులలో పెరుగుతున్న ప్రాధాన్యతను సూచిస్తోంది.
 
విశ్వాసం, సంప్రదాయం అనుసరించే ఈ యాత్రికులలో తరచుగా కుటుంబంలోని వృద్ధ కుటుంబ సభ్యులు అధిక శాతంగా గల కుటుంబాలుగా ఉంటున్నాయి. తమ అవసరాలకు తగిన విధంగా సదుపాయాలతో ఉన్న సరైన బసను కనుగొనడం వారికి ప్రాధాన్యతగా మారింది. బసను గుర్తించడం సులభతరం చేయడానికి, మేక్ మై ట్రిప్ ‘లవ్డ్ బై డివోటీస్’ను పరిచయం చేసింది, దీనిలో 26 ప్రముఖ ఆధ్యాత్మిక గమ్యస్థానాలలో 450+ హోటల్స్ మరియు హోమ్ స్టేస్ యొక్క కలక్షన్ ఉంది. ఆధ్మాత్మిక ప్రయాణాల ప్రణాళిక ఊహలను తొలగించి ప్రయాణికులు సౌకర్యం, సౌకర్యం, పొందడానికి తమ నిర్దిష్టమైన అవసరాలను కేటాయించే బసలను కనుగొనేలా ఇది హామీ ఇస్తుంది.
 
ఈ పురోగతి గురించి మాట్లాడుతూ, అంకిత్ ఖన్నా, ఛీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్-హోటల్, గ్రోత్-ఎమర్జింగ్ బిజినెసెస్, ఇలా అన్నారు, “మెరుగైన రహదారులు, రైలు, ఎయిర్ల కనక్టివిటీతో భారతదేశపు ఆధ్యాత్మిక గమ్యస్థానాలను చేరుకోవడం ఇంతకుముందు కంటే సులభమైంది. నిజమైన ప్రయాణికుల అభిప్రాయాలు, టెక్నాలజీని వినియోగించి అభివృద్ధి చేయబడిన ఇది ప్రయాణికులు సరైన బసను కనుగొనడంలో సహాయపడుతుంది. లక్ష్యం సాధారణం- ప్రణాళికా ఒత్తిడ్ని తొలగించడం. అందువలన భక్తులు నిజంగా ఏది ప్రాధాన్యత గల తమ విశ్వాసం, అనుభవం పైన దృష్టి కేంద్రీకరిస్తారు.”
 
‘లవ్డ్ బై డివోటీస్’ ఫీచర్ ఆరు కీలకమైన అర్హతల లక్షణాలు ఆధారంగా అంచనా వేస్తుంది: ఆరాధన కోసం పవిత్ర స్థలం ఎంత దగ్గరగా ఉంది, విమానాశ్రయాలు, రైల్వేలు, బస్ స్టేషన్లు వంటి రవాణా పాయింట్ల నుండి అందుబాటులో ఉండటం, స్వచ్ఛమైన శాకాహార రెస్టారెంట్లు, పార్కింగ్ సదుపాయాలు, ట్రావెల్ డెస్క్ మద్దతు, వీల్ ఛైర్ సహాయం, డాక్టర్-ఆన్-కాల్, లిఫ్ట్స్, ప్రథమ చికిత్స కిట్స్ వంటి వృద్ధులకు హితమైన సదుపాయాల లభ్యత, మేక్ మై ట్రిప్‌లో 3.5 లేదా అంతకంటే అధికంగా యూజర్ రేటింగ్ కలిగిన బసలు మాత్రమే చేర్చబడతాయి, ఉన్నతమన నాణ్యత, నమ్మకాల ప్రమాణాన్ని నిర్థారిస్తాయి.
 
ఈ కార్యక్రమం ప్రస్తుతం భారతదేశంలో అత్యంతగా కోరుకునే 26 ఆధ్యాత్మిక గమ్యస్థానాలైన ఆజ్మీర్, అమృత్ సర్, అయోధ్య, డియోఘర్, ద్వారక, గురువాయూర్, హరిద్వార్, కట్రా, కుక్కి సుబ్రమణయం, కుంభకోణం, మధురై, మధుర, నాథ్ ద్వారా, ప్రయాగ్ రాజ్, పూరీ, రామేశ్వరం, షిరిడి, సోమ్ నాథ్, తంజావూరు, తిరువన్నామలై, త్రిస్సూర్, తిరుపతి, ఉడుపి, ఉజ్జయిని, వారణాశి, బృందావనం సహా అమలవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను సుపారీ ఇచ్చి హత్య చేయించిన ప్రియుడి ఫ్యామిలీ!!