Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ష్నీడర్‌ ఎలక్ట్రిక్‌కు ఎల్‌ అండ్‌ టీ ఎలక్ట్రికల్‌, ఆటోమేషన్‌ వ్యాపారం అప్పగింత

Advertiesment
ష్నీడర్‌ ఎలక్ట్రిక్‌కు ఎల్‌ అండ్‌ టీ ఎలక్ట్రికల్‌, ఆటోమేషన్‌ వ్యాపారం అప్పగింత
, మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (18:31 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ ఇంజినీరింగ్‌, సాంకేతిక, నిర్మాణ మరియు ఆర్థిక సేవల సంస్థ లార్సన్‌ అండ్‌ టౌబ్రో (ఎల్‌ అండ్‌ టీ) నేడు తమ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఆటోమేషన్‌ (ఎల్‌ అండ్‌ టీ, ఈ అండ్‌ ఏ) వ్యాపారంలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను పూర్తిచేసి విద్యుత్‌ నిర్వహణ మరియు ఆటోమేషన్‌ రంగంలో అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన ష్నీడర్‌ ఎలక్ట్రిక్‌కు అప్పగించినట్లు వెల్లడించింది.
 
ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఎల్‌ అండ్‌ టీ యొక్క ప్రకటిత భవిష్యత్‌ వృద్ధి కోసం విలువను అన్‌లాక్‌ చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా ఉంది. వ్యూహాత్మక పోర్ట్‌ఫోలియో సమీక్షా ప్రక్రియలో భాగంగా ఎలక్ట్రికల్‌ మరియు ఆటోమేషన్‌ వ్యాపారం నుంచి ఇది బయటకు వచ్చింది.
 
ఈ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ముగియడం గురించి శ్రీ ఏఎం నాయక్‌, గ్రూప్‌ ఛైర్మన్‌, లార్సన్‌ అండ్‌ టుబ్రో మాట్లాడుతూ, ‘‘మా ప్రకటిత దీర్ఘకాలిక వ్యూహంలో అత్యంత కీలకమైన మైలురాయిగా ఈ అండ్‌ ఏ వ్యాపారంలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నిలుస్తుంది. ష్నీడర్‌ ఎలక్ట్రిక్‌తో ఈ భాగస్వామ్యం మా ఉద్యోగులు, వ్యాపార భాగస్వాములు, వాటాదారులకు పరస్పర ప్రయోజనకారిగా ఉంటుందని నమ్ముతున్నాము’’ అని అన్నారు.
 
శ్రీ ఎస్‌.ఎన్‌. సుబ్రహ్మణ్యన్‌, సీఈవో అండ్‌ ఎండీ, లార్సన్‌ అండ్‌ టౌబ్రో మాట్లాడుతూ,‘‘ ఈ పూర్తి స్థాయి నగదు డీల్‌ మాకు మరింత బలమైన బ్యాలెన్స్‌ షీట్‌ సృష్టించేందుకు సహాయపడింది. ఈపీసీ కన్‌స్ట్రక్షన్‌ మరియు ప్రాజెక్టులు, తయారీ మరియు రక్షణ, సేవలు వంటి విస్తారమైన మూడు రంగాలపై ఎల్‌ అండ్‌ టీ యొక్క వ్యూహానికి అనుగుణంగా ఇది ఉంటుంది’’ అని అన్నారు.
 
విస్తృత శ్రేణిలో అండ్‌ మీడియం వోల్టేజ్‌ స్విచ్‌గేర్‌, విద్యుత్‌ వ్యవస్థలు, పారిశ్రామిక మరియు భవంతుల ఆటోమేషన్‌ పరిష్కారాలు, విద్యుత్‌ నిర్వహణ వ్యవస్థలు, మీటరింగ్‌ పరిష్కారాలు మరియు ప్రాజెక్టులు, సేవల వ్యాపారాలతో కూడిన ఎల్‌ అండ్‌ టీ యొక్క ఈ అండ్‌ ఏ వ్యాపారాలను ష్నీడర్‌ ఎలక్ట్రిక్‌కు బదిలీ చేయడం జరిగింది. ష్నీడర్‌ ఎలక్ట్రిక్‌ ఇప్పుడు సంబంధిత బ్రాండ్‌ చిహ్నాలను నిర్ధిష్టమైన కాలం వరకూ వినియోగించుకుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'గాడ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ' ఇకలేరు...