దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగిపోతున్నాయి. దీపావళి సందర్భంగా బంగారం ధరలు పెరుగుతుండటం మహిళలకు కష్టంగా మారింది. బంగారం రేట్లు పెరగడానికి అనేక కారణాలున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక తాజాగా అక్టోబర్ 18న దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా వున్నాయంటే..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.46,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,830 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,680 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,680 ఉంది.