Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్యూచర్‌ జెనరాలీ ఇండియా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ నుంచి మనీ బ్యాక్‌ సూపర్‌ ప్లాన్‌

Advertiesment
Future Generali India Life Insurance Company Limited
, మంగళవారం, 25 మే 2021 (16:28 IST)
ఫ్యూచర్‌ జెనరాలీ ఇండియా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎఫ్‌జీఐఎల్‌ఐ) తమ తాజా ఆఫరింగ్‌ ఫ్యూచర్‌ జెనరాలీ మనీ బ్యాక్‌ సూపర్‌ ప్లాన్‌ను విడుదల చేసినట్లు వెల్లడించింది. సంప్రదాయ నాన్‌ పార్టిస్పేటింగ్‌ మనీ బ్యాక్‌ ప్లాన్‌ ఇది. దీనిలో ఏకమొత్తంలో మెచ్యూరిటీ సమయంలో నగదు అవకాశంతో పాటుగా పాలసీ కాలంలో అత్యధిక మనీ బ్యాక్‌ సైతం పొందే అవకాశాలున్నాయి. ఈ మనీ బ్యాక్‌ను సైతం ప్లాటినమ్‌, గోల్డ్‌, సిల్వర్‌ అంటూ మూడు విభాగాల నుంచి ఎంచుకునే అవకాశాలున్నాయి.
 
ప్లాటినమ్‌ విభాగంలో 6 పాలసీ సంవత్సరాలు ముగిసిన తరువాత చివరి పాలసీ సంవత్సరం మినహాయించి ప్రతి సంవత్సరం మనీ బ్యాక్‌ అందిస్తే, గోల్డ్‌ విభాగంలో 8 పాలసీ సంవత్సరాలు ముగిసిన తరువాత చివరి పాలసీ సంవత్సరం మినహాయించి ప్రతి సంవత్సరం మనీ బ్యాక్‌ అందిస్తారు. సిల్వర్‌ విభాగంలో 10 పాలసీ సంవత్సరాలు ముగిసిన తరువాత చివరి పాలసీ సంవత్సరం మినహాయించి ప్రతి సంవత్సరం మనీ బ్యాక్‌ అందిస్తారు. అంతేకాదు, 8వ పాలసీ సంవత్సరం తరువాత అదనపు ప్రయోజనాలను సైతం మెచ్యూరిటీ ప్రయోజనాలను సైతం పొందవచ్చు.
 
ఈ పాలసీ విడుదల సందర్భంగా శ్రీ బికాష్‌ చౌదరీ, అపాయింటెడ్‌ యాక్చురీ అండ్‌ ఆఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌, ఫ్యూచర్‌ జెనరాలీ ఇండియా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘ప్రస్తుత మహమ్మారితో పాటుగా మార్కెట్‌ ఒడిదుడుకుల కారణంగా గతానికన్నా అధికశాతం మంది ప్రజలు ఆర్థికంగా భద్రంగా ఉండాలని కోరుకుంటున్నారు. గ్యారెంటీడ్‌ ఉత్పత్తులపై వీరు అధికంగా దృష్టి సారిస్తున్నారు. అదిదృష్టిలో ఉంచుకుని ఫ్యూచర్‌ జెనరాలీ మనీ బ్యాక్‌ సూపర్‌ ప్లాన్‌ ఆవిష్కరించాం. పాలసీ కాలంలో ఇది వినియోగదారులకు గ్యారెంటీడ్‌ మనీ బ్యాక్స్‌ అందిస్తుంది. దీనితో పాటుగా పాలసీ కాలపరిమితి ముగిసిన తరువాత ఏకమొత్తంలో చెల్లింపులు సైతం జరుపుతుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత మార్కెట్లోకి.. అదిరిపోయే ఫీచర్లతో స్పార్క్‌ 7 సిరీస్‌