గ్యాస్ సిలిండర్ రేటు తగ్గింది. నవంబర్ 1న ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. కొత్త రేట్లు నేటి నుంచే అమలులోకి వచ్చాయి. ఎల్‌పీజీ సిలిండర్ ధర ఏకంగా రూ. 115 మేర పడిపోయింది.
అయితే ఈ తగ్గింపు అనేది కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది. సిలిండర్ రేటు ఏకంగా రూ.115 మేర దిగి వచ్చింది.
అయితే డొమెస్టిక్ సిలిండర్ ధర మాత్రం స్థిరంగానే కొనసాగింది. జూలై 6 నుంచి 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ రేటు నిలకడగానే ఉంటూ వస్తోందని చెప్పుకోవచ్చు. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం తగ్గుతూ వస్తోంది.
అక్టోబర్ 1న కూడా గ్యాస్ సిలిండర్ ధర రూ. 25మేర పడిపోయింది. డొమెస్టిక్ సిలిండర్ రేటు మాత్రం స్థిరంగానే కొనసాగింది. ఇప్పుడు కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. డొమెస్టిక్ సిలిండర్ రేటు స్థిరంగానే ఉంది. కమర్షియల్ సిలిండర్ రేటు తగ్గింది.