Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చోటీ షురూత్‌, బడీ ఉడాన్‌: హైదరాబాద్‌లోని ఓయో హోటల్‌ యజమాని నరేష్‌ సారగండ్ల స్ఫూర్తిదాయక కథ

చోటీ షురూత్‌, బడీ ఉడాన్‌: హైదరాబాద్‌లోని ఓయో హోటల్‌ యజమాని నరేష్‌ సారగండ్ల స్ఫూర్తిదాయక కథ
, శుక్రవారం, 12 మార్చి 2021 (15:38 IST)
నేడు ఓ వ్యాపారవేత్త విజయవంతం కావాలంటే అచంచలమైన ఆత్మవిశ్వాసం, నిబద్ధత, కష్టపడే తత్త్వంతో పాటుగా సాధించాలనుకున్న లక్ష్యంపై ఏకాగ్రత అవసరం. నేడు విజయవంతమైన ఎంతోమంది ఓయో హోటల్‌ యజమానులు ఈ శక్తివంతమైన ఆలోచనా ధోరణులతోనే చిన్నగా తమ వ్యాపారాలను ప్రారంభించారు, తమ ప్రాంతాలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న ప్రోపర్టీలుగా వాటిని మలిచారు. అలాంటి స్ఫూర్తిదాయక కథలలో ఒకటి, నరేష్‌ సారగండ్లది. ‘చోటీ షురూత్‌, బడీ ఉడాన్‌’ అంటూ ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ తాజా ప్రచారంలో భాగంగా ఎంపికైన ఆయన, పెద్ద కలలను కనడానికి మనమెప్పుడూ భయపడకూడదన్నారు.
 
హైదరాబాద్‌లోని ఓయో 40852 హోటల్‌ వైట్‌ రిడ్జ్‌ యజమాని నరేష్‌ సారగండ్ల. తన పాఠశాల విద్య పూర్తయిన వెంటనే వ్యాపార రంగంలో అడుగుపెట్టారతను. ఆయన కుటుంబం కూడా మద్దతునందించడంతో స్నేహితులతో కలిసి డెయిరీ వ్యాపారం ఆరంభించారు. అయినప్పటికీ మరింతగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తుండే వారు. అదే సమయంలో నరేష్‌కు ప్రాణస్నేహితుడు పవన్‌ ఆతిధ్య రంగంలో అడుగుపెట్టాలనుకోవడం, తాను కూడా భాగం అవుతానని నరేష్‌ అడిగారు. దానితో తన సంపాదించిన మొత్తం ఈ హోటల్‌లో పెట్టారు. ఒక సంవత్సరం తరువాత ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌తో భాగస్వామ్యం చేసుకున్నారు. ఇప్పుడు విజయవంతంగా 9 హోటల్స్‌ను ఆయన ఓయోపై నిర్వహిస్తున్నారు.
 
తన అనుభవాలను నరేష్‌ వెల్లడిస్తూ ‘‘పాఠశాల విద్య పూర్తయిన తరువాత నా అంతట నేను ఏదైనా చేయాలనుకున్నాను.  సొంత ఊరిలో పనిచేయడంతో పాటుగా స్థానికులకు ఉద్యోగాలనూ అందించాలనుకున్నాను. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయంతో తొలుత డెయిరీ వ్యాపారం ప్రారంభించాను. అది వృద్ధి చెందుతుంది. అదే సమయంలో తన స్నేహితుడు హోటల్‌ వ్యాపారం ప్రారంభించడం నన్ను ఆకర్షించింది. తరువాత దానిలో నేను కూడా చేరడం, ఓయోతో భాగస్వామ్యం కావడంతో ఇప్పుడు పలు హోటల్స్‌ను నిర్వహించగలుగుతున్నాను. ఇప్పుడు మా వైట్‌ రిడ్జ్‌ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌ ఈ ప్రాంతంలో అత్యుత్తమ ఆతిథ్య రంగ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ఈ సంవత్సరాంతానికి 25 హోటల్స్‌ను తెరవాలని లక్ష్యంగా చేసుకున్నాను’’ అని అన్నారు.
 
విజయ శిఖరాలను చేరడం అంత సులభం కాదని అంగీకరించిన నరేష్‌, ఆతిథ్య రంగంలో విజయం సాధించడానికి అత్యున్నత స్థాయి సేవలు, ప్రామాణికమైన వినియోగదారుల సేవలు వంటివి కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేతివేలికి ఉన్న ఉంగరం ముక్కుకు తగిలి రక్తం వచ్చిందట.. డెలివరీ బాయ్..?