Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

సంక్షోభంలో బీఎస్ఎన్ఎల్.. ఉద్యోగులకు జీతాల్లేవ్.. షట్టర్ క్లోజ్ తప్పదా?

Advertiesment
BSNL
, బుధవారం, 26 జూన్ 2019 (11:01 IST)
బీఎస్ఎన్ఎల్ సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఎస్ఎన్‌ఎల్‌ను మూసేస్తారని ప్రచారం సాగుతోంది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో బీఎస్ఎన్ఎల్ వుంది.


ఒకప్పుడు ఏడాదికి రూ.10వేల కోట్ల పైచిలుకు లాభాలు ఆర్జించిన సంస్థ.. నేడు దాదాపు రూ.13వేల కోట్ల పైచిలుకు అప్పుల్లో కూరుకుపోయింది. బీఎస్ఎన్ఎల్ సంస్థ తీవ్ర నష్టాలను చవిచూసేందుకు రిలయన్స్ జియోనే కారణమని తెలుస్తోంది. 
 
సర్వీస్, టెక్నాలజీ విషయంలోను మిగిలిన సంస్థలతో బీఎస్ఎన్ఎల్ పోటీ పడలేకపోతోంది. ఇందులో భాగంగానే మిగిలిన సంస్థలన్నీ 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో వుంటే బీఎస్ఎన్ఎల్  ఇప్పటికీ 4జీ టెస్టింగ్ వద్దే వుంది. 
 
ఉద్యోగులకు జూన్ నెల వేతనాలు ఇచ్చేందుకు కేంద్రాన్ని బీఎస్ఎన్ఎల్ రూ.850కోట్ల రుణం ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసుకుంది. సంస్థను కొన్ని నెలల పాటు నిలకడగా నడపాలంటే మొత్తం రూ.2500కోట్ల రుణం అవసరమవుతుందని కేంద్రానికి తెలిపింది.అయితే కేంద్రం నుంచి మాత్రం నిధులకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి హామీ లభించలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే బీఎస్ఎన్ఎల్ సేవలు ఆగిపోయే ఆస్కారం వుందని సమాతచారం. 
 
కేంద్రం ఇచ్చే నిధులు తాత్కాలిక ఉపశమనమే తప్పితే.. సంక్షోభానికి తెరదించాలంటే.. బీఎస్ఎన్ఎల్‌ను మరేదైనా ప్రైవేట్ టెలికాం సంస్థతో విలీనం చేస్తేనే మేలని వాణిజ్య విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు నివాసం కూడా అక్రమ నిర్మాణమే... కూల్చివేత తప్పదు : ఎమ్మెల్యే ఆర్కే