Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో కరోనా విజృంభణ : బ్యాంకు పని వేళలు కుదింపు

Advertiesment
తెలంగాణాలో కరోనా విజృంభణ : బ్యాంకు పని వేళలు కుదింపు
, గురువారం, 22 ఏప్రియల్ 2021 (14:34 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజుకు వేలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. దీంతో బ్యాంకుల పనివేళలను తగ్గించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్‌బీసీ) నిర్ణయించింది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ప్రతాపం చూపిస్తుండటం, స్టేట్ బ్యాంకు ఉద్యోగులు దాదాపు 600 మంది వైరస్ బారినపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సేవల్ని పరిమితం చేయాలని ఎస్ఎల్‌బీసీ యోచిస్తోంది.
 
అలాగే, బ్యాంకు విధులకు హాజరయ్యే సిబ్బందిని 50 శాతానికి పరిమితం చేయాలని కూడా నిర్ణయించింది. వచ్చే నెల 15వ తేదీ వరకు బ్యాంకు వేళలను కుదించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వ ఆమోదానికి పంపినట్టు తెలుస్తోంది. అనుమతి వస్తే రేపటి నుంచే కొత్త పనివేళలు అమల్లోకి వస్తాయి. 
 
అయితే బ్యాంకుల ప్రధాన కార్యాలయాల వేళల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు. బ్యాంకు పనివేళలను కనుక తగ్గిస్తే ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మిషన్ల సహా ఇతర ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని ఎస్ఎల్‌బీసీ బ్యాంకర్లను ఆదేశించింది. కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తప్పనిసరి సేవలకు మాత్రమే బ్యాంకులకు రావాలని వినియోగదారులకు సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పసిడి ధరలు.. వెండి ధరలు పెరిగిపోయాయ్... బంగారం కొనాలనుకునే వారికి?