Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

మార్చి నెలలో బ్యాంకు సిబ్బందికి సెలవుల పండుగ

Advertiesment
Bank Holidays 2020
, మంగళవారం, 3 మార్చి 2020 (11:58 IST)
మార్చి నెలలో బ్యాంకు సెలవులు విపరీతంగా వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 19 రోజుల సెలవులు వచ్చాయి. వీటిలో ఆదివారాలు, రెండో శనివారాలు కూడా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే మార్చి నెలలో 19 రోజుల పాటు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. 
 
మార్చి నెలలో తమ డిమాండ్ల పరిష్కారం కోసం బ్యాంకు ఉద్యోగ సంఘాల మూడు రోజుల పాటు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. వీటితో పాటు 16 రోజుల పాటు సాధారణ, పండగలు కలుపుకుని ఏకంగా 19 రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. 
 
వేతనాల పెంపును కోరుతూ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్‌ఐ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ)… మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజుల దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనుంది. 
 
కాగా 20 శాతం వేతనాలు పెంచాలని ఎంప్లాయిస్ యూనియన్లు డిమాండ్ చేస్తుంటే, 12.5 శాతం పెంచేందుకు బ్యాంకు యాజమాన్యాలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఉద్యోగ సంఘాల నేతలు, బ్యాంకు యాజమాన్యాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. 
 
ఈ చర్చలు ఫలిస్తే ఈ మూడు రోజుల తలపెట్టిన సమ్మెను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. లేనిపక్షంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. కాగా, మార్చి నెలలో రానున్న సాధారణ, పండగ సెలవులను ఓసారి పరిశీలిస్తే, 
 
 
మార్చి 1వ తేదీ ఆదివారం. 
మార్చి 5వ తేదీ పంచాయతీ రాజ్ దినోత్సవం (ఒడిషా) 
మార్చి 6వ తేదీ చాప్పర్‌కుట్ పండగ (మిజోరం)
మార్చి 8వ తేదీ ఆదివారం. 
మార్చి 9వ తేదీ హజరత్ అలీ పండగ (ఉత్తరప్రదేశ్)
మార్చి 10 డోల్ పూర్ణిమ (ఒడిషా, వెస్ట్ బెంగాల్, త్రిపుర), హోళి (కొన్ని రాష్ట్రాల్లో హోళీకి రెండు రోజుల సెలవు) 
మార్చి 11 నుంచి 13 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె
మార్చి 14వ తేదీ రెండో శనివారం. 
మార్చి 15వ తేదీ ఆదివారం. 
మార్చి 22వ తేదీ ఆదివారం. 
మార్చి 23వ తేదీ షాహిద్ భగత్ సింగ్ డే (హర్యానా)
మార్చి 25వ తేదీ ఉగాది (ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, మణిపూర్, జమ్మూకాశ్మీర్)
మార్చి 26వ తేదీ చేటిచంద్ యూనివర్శరీ (గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్) 
మార్చి 27వ తేదీన సర్హుల్ పండగ (ఝార్ఖండ్) 
మార్చి 28వ తేదీన నాలుగో శనివారం. 
మార్చి 29వ తేదీ ఆదివారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

5న శంకరగుప్తం గ్రామంలో మంగళంపల్లి విగ్రహావిష్కరణ