Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘BAFTA బ్రేక్ త్రూ ఇండియా 2021’లో పాల్గొనే 10 మందిని BAFTA ఆవిష్కరించింది

‘BAFTA బ్రేక్ త్రూ ఇండియా 2021’లో పాల్గొనే 10 మందిని BAFTA ఆవిష్కరించింది
, శుక్రవారం, 11 జూన్ 2021 (18:31 IST)
బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (BAFTA) నెట్‌ఫ్లిక్స్ భాగస్వామ్యంతో మొట్టమొదటి BAFTA బ్రేక్‌త్రూ ఇండియా ఇనిషియేటివ్‌లో పాల్గొనడానికి ఎంపికైన వారిని ప్రకటించింది. అనుపమ్ ఖేర్, మోనికా షెర్గిల్, మీరా నాయర్ మరియు సిద్ధార్థ్ రాయ్ కపూర్లతో సహా పరిశ్రమ నిపుణుల గౌరవనీయ జ్యూరీ, భారతదేశంలోని చలనచిత్రం, ఆటలు మరియు టెలివిజన్ పరిశ్రమల నుండి 10 మంది అత్యుత్తమ ప్రతిభావంతులను ఎంపిక చేసింది.
 
BAFTA తన ప్రధాన ప్రతిభ ఇనిషియేటివ్ ‘BAFTA బ్రేక్‌త్రూ ఇండియా’ కోసం దరఖాస్తు చేసుకోవాలని దేశవ్యాప్తంగా అభ్యర్థులను ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా చలనచిత్రం, ఆటలు మరియు టెలివిజన్ పరిశ్రమల నుండి అధిక సంఖ్యలో ఉత్తమ ప్రతిభావంతుల నుండి వచ్చిన నాణ్యమైన అప్లికేషన్ల కారణంగా, గతంలో ప్రకటించిన దానికి రెట్టింపు సంఖ్యలో, ఈ చొరవ తాజాగా రూపుదిద్దుకుంటున్న పదిమంది భారతీయుల ప్రతిభను ఎంపిక చేసింది.
 
2020/21 కొరకు చలనచిత్రం, ఆటలు మరియు టెలివిజన్ పరిశ్రమల యొక్క భవిష్యత్ తారలతో కూడిన BAFTA బ్రేక్ త్రూ లో పాల్గొనేవారి యొక్క అద్భుతమైన ప్రతిభావంతుల జాబితా క్రింద ఉంది:
 
అక్షయ్ సింగ్, రచయిత/ నిర్మాత (మెహసంపూర్, ది గోల్డ్-లాడెన్ షీప్ మరియు ది సాకెర్డ్ మౌంటైన్)
అరుణ్ కార్తీక్, దర్శకుడు/ రచయిత (నాసిర్, శివపురాణం/ద స్ట్రేంజ్ కేస్ ఆఫ్ శివ)
జే పినాక్ ఓజా, సినిమాటోగ్రాఫర్ (గల్లీ బాయ్)
కార్తికేయ మూర్తి, స్వరకర్త (KD (ఎ) కరుప్పుదురై)
పలోమి ఘోష్, నటుడు (టైప్‌రైటర్, నాచోమ్-ఇయా కుంపసర్)
రేణు సావంత్, దర్శకుడు/ రచయిత (ది ఎబ్ టైడ్)
శ్రుతి ఘోష్, గేమ్ డెవలపర్ & ఆర్ట్ డైరెక్టర్ (రాజి- యాన్ ఏన్షియంట్ ఎపిక్)
సుమిత్ పురోహిత్, డైరెక్టర్/ రచయిత (స్కామ్ 1992 - రచయిత / ఎడిటర్)
తాన్య మణిక్తలా, నటుడు (ఎ సూటబుల్ బాయ్)
విక్రమ్ సింగ్, డైరెక్టర్ (ఎలిఫెంట్స్ ఇన్ మై బ్యాక్యార్డ్)
 
పాల్గొనేవారు వన్-టు-వన్ మెంటరింగ్, గ్లోబల్ నెట్‌వర్కింగ్ అవకాశాలు, 12 నెలల పాటు BAFTA ఈవెంట్స్ మరియు స్క్రీనింగ్‌లకు ఉచిత ప్రవేశం మరియు పూర్తి ఓటింగ్ BAFTA సభ్యత్వాన్ని పొందుతారు. బ్రిటీష్ మరియు భారతీయ సృజనాత్మక పరిశ్రమలలోని కొన్ని ఉత్తమమైన వాటితో వారు కనెక్ట్ అవుతారు మరియు వాటి నుండి చాలా నేర్చుకుంటారు, ప్రపంచవ్యాప్తంగా వారి నైపుణ్యాన్ని తోటి వారితో పంచుకోవచ్చు, భౌగోళిక సరిహద్దులను దాటి గొప్ప అవకాశాలకు ప్రాప్యతను పొందుతారు మరియు ప్రపంచవ్యాప్తంగా BAFTA బ్రేక్‌త్రూ కళాకారులుగా ప్రచారం చేయబడతారు.
 
ఈ రోజు, BAFTA తదుపరి బ్రేక్ త్రూ ఇండియా కోహోర్ట్ కోసం దరఖాస్తులను ప్రారంభించడంలో ఆలస్యాన్ని ప్రకటించింది, వాస్తవానికి మొదట జూన్ 10న UK మరియు USA అప్లికేషన్లతో పాటు ప్రారంభించబడుతుంది. భారతదేశంలో ఇంత క్లిష్ట సమయంలో భవిష్యత్ బ్రేక్‌త్రూ ప్రతిభకు అవసరమైన స్థలం మరియు సమయాన్ని అనుమతించడానికి ఈ నిర్ణయం తీసుకోబడింది. వారి కెరీర్ ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నందున ప్రస్తుత బ్రేక్‌త్రూ ఇండియా సహకారానికి BAFTA మద్దతునిస్తూనే ఉంటుంది.
 
BAFTA యొక్క చెఫ్ ఎగ్జిక్యూటివ్ అమండా బెర్రీ OBE ఇలా వ్యాఖ్యానించారు: "మేము ఎనిమిది సంవత్సరాల క్రితం UK లో బ్రేక్‌త్రూ ను ప్రారంభించాము మరియు అప్పటి నుండి ఇప్పటివరకు 160 మంది ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించి వారికి సహకారాన్ని అందించాము. మునుపటి బ్రేక్‌త్రూలలో పాల్గొన్నవారు వారి కెరీర్‌లో మరింత వృద్ధి చెందడాన్ని మేము చూస్తున్నాము, చాలామంది BAFTA -విజేతలుగా మరియు నామినీలుగా మారారు. బ్రేక్‌త్రూ ఇప్పుడు భారతదేశానికి విస్తరించబడిందని తెలిసి నేను చాలా ఆనందపడ్డాను; పాల్గొనేవారందరికి మా అభినందనలు తెలియజేస్తున్నాను మరియు పెరుగుతున్న BAFTA బ్రేక్‌త్రూ కుటుంబానికి స్వాగతం.
 
బ్రేక్‌త్రూ యొక్క ప్రపంచ విస్తరణకు మద్దతు ఇచ్చినందుకు నెట్‌ఫ్లిక్స్‌కు మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము, విభిన్న నేపథ్యాలు మరియు సంస్కృతుల నుండి పుట్టుకొస్తున్న ప్రతిభను సెలబ్రేట్ చేసుకోవడానికి వారు మా విజన్‌ను పంచుకుంటారు. భవిష్యత్ బ్రేక్‌త్రూ ప్రతిభకు మద్దతు ఇవ్వడానికి మేము నిబద్ధతతో కొనసాగుతాము, కాని మహమ్మారి కారణంగా భారతదేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల గురించి కూడా మేము గుర్తుంచుకున్నాము, కాబట్టి ఈ రోజు ప్రకటించిన బ్రేక్‌త్రూలో పాల్గొనేవారికి మేము పూర్తిగా మద్దతు ఇస్తాము, తదుపరి రౌండ్ అప్లికేషన్లను ఆలస్యంగా ప్రారంభించాలని మేము నిర్ణయించుకున్నాము.”
 
BAFTA బ్రేక్‌త్రూ ఇండియా అంబాసిడర్ మరియు జ్యూరీ చైర్ ఎఆర్ రెహమాన్ ఇలా వ్యాఖ్యానించారు: "చలనచిత్రం, ఆటలు మరియు టెలివిజన్ పరిశ్రమల నుండి వచ్చిన అత్యుత్తమ ప్రతిభావంతుల అప్లికేషన్ల నాణ్యత చాలా అధికంగా ఉంది, వాస్తవానికి అనుకున్నట్లు ఐదు కంటే ఎక్కువగా, ఈ సంవత్సరం బ్రేక్ త్రూ చొరవలో భాగంగా అర్హులైన పది మంది భారతీయుల ప్రతిభను ఎన్నుకోవాలని జ్యూరీని ఒప్పించాము. భారతదేశం అందించే సృజనాత్మక ప్రతిభ స్థాయికి ఇది ఒక పెద్ద నిదర్శనం. మన దేశం క్లిష్టమైన సమయాన్ని ఎదుర్కొంటున్నందున, ఈ కార్యక్రమం భారతీయ ప్రతిభకు జీవితకాలపు అవకాశాన్ని కల్పిస్తుందని మేము విశ్వసిస్తున్నందున, త్వరలో మరో బృందాన్ని ప్రారంభించాలని మేము ఆశిస్తున్నాము మరియు రాబోయే సంవత్సరాల్లో పాల్గొన్నవారికి బ్రేక్ త్రూ తీసుకువచ్చే కొత్త అవకాశాలను చూడాలని నేను ఎదురుచూస్తున్నాను.”                                                                                                                
 
నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ VP మోనికా షెర్గిల్ ఇలా మాట్లాడారు: “భారతదేశం ప్రపంచంలోని గొప్ప స్టోరీ టెల్లింగ్ కేంద్రాలలో ఒకటి. ఈ కఠినమైన సమయాలు ఉన్నప్పటికీ, కళా ప్రక్రియలలో ఇటువంటి అద్భుతమైన భారతీయ ప్రతిభను చూడటం నమ్మశక్యం కాదు. ఇది నూతన ప్రతిభ, క్రొత్త గాయనీగాయకులు మరియు అన్‌టోల్డ్ కథలకు దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించగల అద్భుతమైన అవకాశాలను గుర్తు చేస్తుంది. BAFTA బ్రేక్ త్రూలో పాల్గొనే పది మంది తెలివైన ప్రతిభావంతులైన అభ్యర్థులకు అభినందనలు. వారు భారతీయ సృజనాత్మక సమాజంలో అత్యుత్తమమైన వారికి ప్రతీకగా ఉంటారు మరియు ముందుకు సాగే మార్గాలలో వారు పొందే కీర్తి కోసం నేను ఎదురు చూస్తున్నాను.”
 
UK మరియు USAలో BAFTA బ్రేక్ త్రూ కోసం దరఖాస్తులు ఈ రోజు నుండి తెరవబడ్డాయి. 2013లో ప్రారంభించినప్పటి నుండి, ప్రదర్శనకారులు బుక్కి బక్రే, పాపా ఎస్సీడు, లెటిటియా రైట్, ఫ్లోరెన్స్ పగ్, జోష్ ఓ'కానర్, అబూబకర్ సలీమ్ మరియు లారెన్ రిడ్లాఫ్, ఆటల క్రియేటివ్స్ చెల్లా రామనన్, సెగున్ అకినోలా, గెమ్మ లాంగ్ఫోర్డ్ , మరియు దర్శకులు నికోల్ న్యూన్హామ్, జిమ్ లెబ్రెచ్ట్, రోజ్ గ్లాస్, స్టెల్లా కొరాడి మరియు డెస్టినీ ఎకరాఘా, ఇంకా చాలా మంది ఉన్నారు. మునుపటి బ్రేక్ త్రూ పూర్వ విద్యార్థులు ఆయా విభాగాలలో మరింత అభివృద్ధిని సాధించారు, చాలామంది BAFTA - విజేతలుగా మరియు నామినీలుగా మారారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా భార్య అందగత్తె, 25 వేలకు ఇద్దరు స్నేహితులకు ఆఫర్ ఇచ్చిన భర్త