Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిజిటల్‌ మీడియాపై ఇన్ల్ఫూయెన్సర్‌ ఎడ్వర్టయిజింగ్‌: తుది మార్గదర్శకాలు జారీ చేసిన ASCI

Advertiesment
డిజిటల్‌ మీడియాపై ఇన్ల్ఫూయెన్సర్‌ ఎడ్వర్టయిజింగ్‌: తుది మార్గదర్శకాలు జారీ చేసిన ASCI
, గురువారం, 27 మే 2021 (18:29 IST)
ఎడ్వర్టయిజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ) నేడు డిజిటల్‌ మీడియాపై ఇన్ల్ఫూయెన్సర్‌ ఎడ్వర్టయిజింగ్‌కు సంబంధించిన తుది మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ముసాయిదా మార్గదర్శకాలను తొలుత ఫిబ్రవరిలో జారీ చేశారు. అనంతరం వాటాదారులు- ఎడ్వర్టయిజర్లు, ఏజెన్సీలు, ఇన్ల్ఫూయెన్సర్లు మరియు వినియోగదారుల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. సహకార యుక్త ప్రక్రియ మరియు నిష్ణాతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సోషల్‌ స్టోరీ టెల్లింగ్‌కు సంబంధించిన సుప్రసిద్ధ మార్కెట్‌ ప్రాంగణం బిగ్‌ బ్యాంగ్‌ డాట్‌ సోషల్‌తో ఆస్కీ భాగస్వామ్యం చేసుకుని, భారతదేశంలో అతిపెద్ద డిజిటల్‌ ఇన్ల్ఫూయెన్సర్‌ అభిప్రాయాలను పొందింది.
 
ఈ మార్గదర్శకాలు వాణిజ్య సందేశాలు లేదా జూన్‌ 14, 2021 వ తేదీ మరియు ఆ తరువాత  ప్రచురితమయ్యే ప్రకటనలకు వర్తిస్తుంది. ఈ మార్గదర్శకాలను ఇన్ల్ఫూయెన్సర్లు తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. తద్వారా వారు పోస్ట్‌ చేసే ప్రమోషనల్‌ కంటెంట్‌పై లేబుల్‌ కనిపిస్తుంది.
 
ఇప్పుడు డిజిటల్‌ మీడియా కంటెంట్‌ వినియోగం సాధారణమైంది. కంటెంట్‌ మరియు ప్రచార ప్రకటనల నడుమ వైవిధ్యత తెలుసుకోవడం కష్టంగా ఉంది. మార్కెటింగ్‌ వాతావరణం సమూలంగా మారిపోతుంది. ఇన్ల్ఫూయెన్సర్‌ మార్కెటింగ్‌ అనేది ప్రధాన స్రవంతిగా మారింది. అందువల్ల, వినియోగదారులకు తాము చూసే కంటెంట్‌లో దేనికి బ్రాండ్లు చెల్లిస్తున్నాయో తెలుసుకునే హక్కు ఉంది. ఈ మార్గదర్శకాలను ఇన్ల్ఫూయెన్సర్‌ మార్కెటింగ్‌లో పారదర్శకత తీసుకువచ్చేందుకు తీసుకువచ్చాం. ఇన్ల్ఫూయెన్స్‌ ఈక్వెల్స్‌ యాక్షన్‌ అనేది ఇప్పుడు వాస్తవంగా మారింది. నేడు వినియోగదారులు కేవలం ఇన్ల్ఫూయెన్సర్లు ప్రచారం చేసే ఉత్పత్తులు మరియు సేవలను కొనుగోలు చేయడం మాత్రమే కాదు వారు సృష్టించిన  బ్రాండ్‌ కథలను కూడా కొనుగోలు చేస్తున్నారు. అందువల్ల ఈ మార్గదర్శకాలు వినియోగదారులు, ఇన్ల్ఫూయెన్సర్లు, మార్కెటీర్లు, ఎడ్వర్టయిజింగ్‌  పరిశ్రమ ప్రయోజనాలను కాపాడతాయి.
 
ముసాయిదా మార్గదర్శకాలను పంచుకున్నప్పుడు, ఇన్ల్ఫూయెన్సర్‌ కమ్యూనిటీ  మరియు ఇతర వాటాదారుల నడుమ అవి తీవ్ర చర్చకు దారి తీశాయి. మేము దాదాపు 25 మంది విభిన్నమైన వాటాదారుల నుంచి గత రెండు నెలలకాలంలో అభిప్రాయాలను అందుకున్నాం. ఈ అభిప్రాయాలను పంచుకున్న పరిశ్రమ అసోసియేషన్లలో ఐఏఎంఏఐ, ఐబీహెచ్‌ఏతో పాటుగా ప్రకటన కర్తలు అయినటుంటి పెప్సీ, పీ అండ్‌ జీ, నెస్లే, హెచ్‌యుఎల్‌, టాటా, స్టార్‌ వంటివి ఉన్నాయి. అలాగే వలెంటరీ కన్స్యూమర్‌ సంస్థల నుంచి కూడా మేము అభిప్రాయాలను అందుకున్నాం. డాలీ సింగ్‌, విష్ణు కౌషల్‌, ఆయేషా బిల్లి మోరియా, ఆనం సీ, షెర్జాడీ ష్రాఫ్‌, తల్వార్‌ అకా  షెర్రీ ష్రాఫ్‌, రాఘవ్‌ మీటెల్‌, వరుణ్‌ దుగ్గిరాల మరియు మరెంతో మంది నుంచి అభిప్రాయాలను అందుకున్నాం. ఈ అభిప్రాయాలన్నీ ఆస్కీ పరిగణలోకి తీసుకోవడంతో పాటుగా వారి ఆందోళనలు, సూచనలు సైతం పరిగణలోకి తీసుకుని తుది మార్గదర్శకాలను రూపొందించింది.
 
ఆస్కీ ఛైర్మన్‌ సుభాష్‌ కామత్‌ మాట్లాడుతూ, ‘‘అపూర్వమైన రీతిలో సానుకూల స్పందన మరియు అభిప్రాయాలను ఇన్ఫూయెన్సర్లు, ఇతరుల నుంచి డ్రాఫ్ట్‌ మార్గదర్శకాల కోసం మేము అందుకున్నాం. అదే రీతిలో  సూచనలను సైతం కొన్ని అంశాలను మెరుగుపరుచుకునేందుకు, కొన్ని అంశాలలో స్పష్టత కోసం అందుకున్నాం. విస్తృత స్థాయి చర్చల తరువాత మేము ఇప్పుడు తుది మార్గదర్శకాలను  విడుదల చేస్తున్నాం. ఇవి వినియోగదారులు, ఇన్ల్ఫూయెన్లర్లు, ఏజెన్సీలు, ఎడ్వర్టయిజర్లు మరియు ఇతర వాటాదారుల ప్రయోజనాలను సమతుల్యం చేస్తాయి. ఆస్కీ కోడ్‌    మరియు  మార్గదర్శకాలు ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిందిగా మేము కోరుతున్నాం. తద్వారా పారదర్శకత, బాధ్యత అందిస్తామనే వాగ్ధానంలో భాగం కావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాము’’అని అన్నారు.
 
ఈ మార్గదర్శకాలను అతిక్రమించిన వారిని ఆస్కీ ఏ విధంగా గుర్తిస్తుందనే సందేహాన్ని ఎక్కువ మంది వ్యక్తీకరించారు. దీనికోసం ఆస్కీ ఇప్పుడు ఫ్రెంచ్‌ టెక్నాలజీ ప్రదాత రీచ్‌ను గుర్తించింది. ఆస్కీ సెక్రటరీ జనరల్‌ మనీష్‌ కపూర్‌ మాట్లాడుతూ ‘‘రీచ్‌ ఇన్ల్ఫూయెన్సర్‌ క్లౌడ్‌ ఫ్లాట్‌ఫామ్‌ కృత్రిమ మేథస్సును వినియోగించుకుని సోషల్‌మీడియాపై వాణిజ్య స్వభావం ఉండి వాటిపై ఆ స్వభావం తెలిపే లేబుల్‌ లేని వాటిని గుర్తిస్తుంది. మెషీన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్స్‌ మరియు ప్యాట్రర్న్‌ సెర్చింగ్‌ రీజెక్స్‌ (రెగ్యులర్‌ ఎక్స్‌ప్రెషన్‌) ఈ ఖచ్చితత్త్వం వృద్ధి చేస్తుంది. డిజిటల్‌ కంటెంట్‌పై ఆస్కీ యొక్క మెరుగైన దృష్టిలో భాగంగా,  మేము అత్యాధునిక  సాంకేతికత పరిష్కారాలను అమలులోకి తీసుకురావడం ద్వారా ఆస్కీ కోడ్‌ అతిక్రమించిన ప్రకటనలను గుర్తిస్తాము..’’ అని అన్నారు.
 
ఈ మార్గదర్శకాలతో పాటుగా ఆస్కీ ఇప్పుడు సమ్మిళిత విద్యా విధానం సైతం అభివృద్ధి చేసింది. తద్వారా ఇన్ల్ఫూయెన్సెర్‌ ఎడ్వర్టయిజింగ్‌ కథనంకు ఓ ఆకృతి అందిస్తుంది. దీనిని చేరుకునేందుకు, ఆస్కీ ఇప్పుడు ఆస్కీ డాట్‌ సోషల్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. మార్గదర్శకాలకు సంబంధించిన సమాచారం మొత్తం తమంతట తాము తెలుసుకునేందుకు ఏకీకృత కేంద్రంగా ఇది ఉంటుంది. ఈ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ఇంటరాక్టివ్‌గా  చేయాల్సిన, చేయకూడని అంశాలు, తరచుగా వచ్చే సందేహాలు-సమాధానాలు, మార్గదర్శకాలకు సంబంధించిన సమాచారం మొదలైనవి ఉంటాయి. కొంతకాలానికి ఆస్కీ డాట్‌ సోషల్‌ ,  సోషల్‌ మీడియా ఇన్ల్ఫూయెన్సర్లు, వినియోగదారులు, ప్రకటనకర్తలు, టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీల కమ్యూనిటీ సృష్టించగలదని ఆశాభావంతో ఉంది.
 
ధృవ్‌ చిట్గోపెకర్‌, ఫౌండింగ్‌ పార్టనర్‌, కలెక్టివ్‌ ఆర్టిస్ట్స్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సీఈవో-బిగ్‌బ్యాంగ్‌ డాట్‌ సోషల్‌ మాట్లాడుతూ, ‘‘సోషల్‌ మీడియా ద్వారా వినియోగదారులకు బ్రాండెడ్‌ కమ్యూనికేషన్‌ చేరుకోవడం చాలా వేగంగా జరుగుతున్న వేళ ఈ మార్గదర్శకాలు ఇప్పుడు తక్షణావసరం. సంప్రదాయ మీడియా ఎడ్వర్టయిజింగ్‌కు సంబంధించి మన దగ్గర మార్గదర్శకాలు ఉన్నాయి కానీ ఇన్ల్ఫూయెన్సర్‌ మార్కెటింగ్‌ వేగంగా పెరుగుతున్న వేళ ఇవి తప్పనిసరి. ఆస్కీ తరపున బోర్డుపైకి రావడంతో పాటుగా సోషల్‌ మీడియా ఇన్ల్ఫూయెన్సర్లతో విస్తృతంగా పనిచేయడం ద్వారా తెలుసుకున్న అంశాలతో పాటుగా బ్రాండ్ల ప్రయత్నాలను సైతం అర్థం చేసుకుని సూచనలు అందించాం. ఇప్పుడు సమగ్రంగా మరియు ఆచరణీయ మార్గదర్శకాలు రావడంపట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు.
 
భారతదేశపు సుప్రసిద్ధ డిజిటల్‌ ఇన్ల్ఫూయెన్సర్‌ డాలీ సింగ్‌ మాట్లాడుతూ, ‘‘డిజిటల్‌ మార్కెటింగ్‌ రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతుంది. అదే రీతిలో పార్టిస్పెంట్స్‌ కూడా వృద్ధి చెందుతున్నారు. క్రోడీకరించిన వ్యవస్థ కలిగి ఉండటానికి ఇది సరైనసమయం. ఆస్కీ తీసుకున్న ఈ చర్యలకు నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. వీటి ద్వారా మాలాంటి ఇన్ల్ఫూయెన్సర్ల పట్ల వీక్షులకు మరింత నమ్మకం కలుగుతుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెజాన్ కొత్త సీఈవోగా ఆండీ జెస్సీ - జూలై 5న బాధ్యతల స్వీకరణ