Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2300 మందికి లేఆఫ్ నోటీసులు

Amazon
, గురువారం, 19 జనవరి 2023 (14:21 IST)
అంతర్జాతీయ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ సంస్థలోని ఉద్యోగులను దశల వారీగా తొలగించేందుకు నిర్ణయించింది. ఇందులోభాగంగా, మున్ముందు ఏకంగా 18 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలిపింది. ఈ నెల తొలి వారంలోనే 8 వేల మందిని తొలగించింది. తాజాగా మరికొందరికి లే ఆఫ్ ప్రకటించింది. ఈ సంఖ్య 2300గా ఉంది. వీరందరికీ హెచ్చరిక నోటీసులు పంపించింది. 
 
అమెరికా కార్మిక చట్టాల ప్రకారం కంపెనీలో భారీ తొలగింపుల వల్ల ప్రభావితమైన ఉద్యోగులకు 60 రోజుల ముందే నోటీసులు జారీ చేయాలన్న నిబంధన ఉంది. అందులోభాగంగానే ఈ నోటీసులు జారీచేసింది. అమెరికా, కెనడా, కోస్టారికా దేశాల్లో తమ ఉద్యోగులకు అమెజాన్ సంస్థ ఈ నోటీసులు జారీచేసింది. 
 
ఈ నోటీసులు అందుకున్న ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కాగా, రెండో దశ తొలగింపు చర్యలు మార్చి నెలలో ప్రారంభమవుతాయి. అలాగే, ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న వారికి ఆ కంపెనీ పరిహారం కూడా అందజేయనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

18వేల మంది ఉద్యోగులపై అమేజాన్ వేటు