Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అట్-హోమ్ హెల్త్ డయాగ్నోస్టిక్స్ సేవలు ప్రారంభించిన అమేజాన్ ఇండియా

Advertiesment
Amazon

ఐవీఆర్

, ఆదివారం, 22 జూన్ 2025 (20:00 IST)
బెంగళూరు: అమేజాన్ డయాగ్నోస్టిక్స్‌ను అమేజాన్ ఇండియా ఈరోజు ప్రకటించింది. కస్టమర్లు ల్యాబ్ పరీక్షలు బుక్ చేయడానికి, అప్పాయంట్మెంట్స్‌ను షెడ్యూల్ చేయటానికి, ట్రాక్ చేయడానికి, అమేజాన్ యాప్ నుండి వెంటనే డిజిటల్ రిపోర్ట్స్‌ను యాక్సెస్ చేయడానికి ఒక కొత్త అట్-హోమ్ డయాగ్నోస్టిక్స్ సేవలను ప్రారంభించింది. అమేజాన్ డయాగ్నిస్టిక్స్‌తో, 6 నగరాల్లోని 450+ పిన్ కోడ్స్ కస్టమర్లు సులభంగా 800కి పైగా డయాగ్నోస్టిక్స్ పరీక్షలను బుక్ చేయవచ్చు. 60 నిముషాలు లోగా ఇంటి వద్ద శ్యాంపిల్ సేకరణ, వాడుకగా చేసే సాధారణ పరీక్షలు కోసం 6 గంటల లోపు డిజిటల్ రిపోర్ట్స్‌ను పొందవచ్చు. ప్రస్తుతం ఈ సేవలు బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ముంబయి, హైదరాబాద్‌లలో లభిస్తోంది. అమేజాన్ డయోగ్నిస్టిక్స్ ప్రస్తుతం ప్రముఖ గుర్తించబడిన డయోగ్నిస్టిక్ ప్రొవైడర్ ఆరంజ్ హెల్త్ ల్యాబ్స్ సహకారంతో ఈ సేవలు అందిస్తోంది.
 
ఎక్కువసేపు వేచి ఉండటం, నాణ్యత ఏకరీతిగా లేకపోవడం, అందుబాటులో లేకపోవడం వంటి నివారణా సంరక్షణను తరచు ఆటంకపరుస్తున్న సమస్యలను అమేజాన్ డయాగ్నోస్టిక్స్ పరిష్కరించడానికి ముందుకు వచ్చింది. వేగంగా, నమ్మకంగా, అన్వేషించవలసిన అవసరం లేకుండా లేదా ఎక్కువసేపు వేచి ఉండటం భరించనవసరం లేకుండా డయోగ్నిస్టిక్స్ సేవలను పొందడానికి అమేజాన్ డయాగ్నోస్టిక్స్ కస్టమర్లకు వీలు కల్పిస్తోంది. దీని ద్వారా వేగంగా ఇంటి వద్ద శ్యాంపిల్ సేకరణ జరుగుతుంది, సకాలంలో రిపోర్ట్స్ అందచేయబడతాయి, కఠినమైన డేటా గోప్యత, నాణ్యతా ప్రామాణాలు అనుసరించబడతాయి. ప్లాట్ ఫారం వాస్తవిక సమయంలో స్లాట్ కనిపించడం, మ్యాప్-ఆధారంగా చిరునామా ధృవీకరణ, అమేజాన్ హెల్త్ డాష్ బోర్డ్ ద్వారా సురక్షితమైన డిజిటల్ రిపోర్ట్ పొందడం, స్వయంచాలిత పరీక్షా తయారీ సూచనలు వంటి తెలివైన ఫీచర్లను కూడా చేర్చింది- ఇవన్నీ నిరంతరంగా బుక్కింగ్ చేయడానికి తోడ్పడతాయి.
 
ఈ ప్రారంభంతో, అమేజాన్ కస్టమర్లు ఇప్పుడు పూర్తి ఎండ్-టు-ఎండ్ ఆరోగ్య సంరక్షణ సేవలను పొందగలరు, అనగా టెలీ-సంప్రదింపు నుండి, మందులను డెలివరీ చేయడం, గుర్తించబడిన పరీక్షలు, అన్నీ ‘అమేజాన్ మెడికల్‘ ద్వారా పొందవచ్చు. ఈ ప్రారంభోత్సవం గురించి మాట్లాడుతూ, జయరామ కృష్ణన్, బాల సుబ్రమణియన్- కాటగిరి నాయకుడు, అమేజాన్ మెడికల్ ఇలా అన్నారు, “కస్టమర్లు అందరి కోసం ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులో, విశ్వశనీయంగా, సౌకర్యంగా చేయడంలో అమేజాన్ డయాగ్నోస్టిక్స్ ఒక గణనీయమైన ముందడుగును సూచిస్తోంది.

ఉన్నతమైన నాణ్యత, డాక్టర్-ధృవీకరించిన ల్యాబ్ పరీక్ష నిరంతరంగా అమేజాన్ యాప్ లోకి సమీకృతమవడం కేటాయించడం ద్వారా, తమ ఇంటి సౌకర్యం నుండి ప్రపంచ స్థాయికి చెందిన డయోగ్నిస్టిక్ సదుపాయాలతో మా కస్టమర్లను సమర్థవంతులను చేస్తున్నాము. మా కస్టమర్లకు ఆరంజ్ హెల్త్ సేవలను అందచేయడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. ఆరంజ్ హెల్త్ వంటి గుర్తించబడిన సర్వీస్ ప్రొవైడర్‌తో మా ప్రమేయం డయోగ్నిస్టిక్ శ్రేష్టతకు హామీ ఇస్తుంది, అమేజాన్ వారి కార్యకలాపాల నిపుణుత వేగం, నమ్మకం, విశ్వాసాలను నిర్థారిస్తుంది.”
 
ఈ భావోద్వేగం గురించి వ్యాఖ్యానిస్తూ, ధ్రువ్ గుప్తా, సహ స్థాపకులు, ఆరంజ్ హెల్త్ ల్యాబ్స్ ఇలా అన్నారు, “మా కస్టమర్లకు డయోగ్నిస్టిక్స్ గొప్పగా ప్రతిస్పందించేలా, నమ్మకంగా చేయడానికి మేము 2021 ప్రారంభంలో ఆరంజ్ హెల్త్‌ను ప్రారంభించాము. ఈ కేంద్రీకరణ మాకు కస్టమర్ల పట్ల ఎంతో ప్రేమను కలగచేసింది. ఈరోజు భారతదేశంలో ప్రముఖంగా గుర్తించబడిన ల్యాబ్స్‌లో ఒకటిగా నిలిచింది. మేము ఎల్లప్పుడూ అమేజాన్ వారి ఆవిష్కరణ, కస్టమర్ పట్ల అభిమానం, జీవితాలను ఉన్నతమైన స్థాయిలో మార్చగలిగే సామర్థ్యాన్ని ఆరాధిస్తాము. వారితో భాగస్వామం చేయడం ఆరంజ్ హెల్త్ అయిదేళ్ల లోపు సంపాదించిన నమ్మకాన్ని నిర్థారిస్తోంది. అమేజాన్‌తో కలిసి, మేము స్థాయిని పెంచుతాము, భారతదేశ ప్రజలకు మరింత వేగంగా, నమ్మకమైన, అవగాహనతో కూడిన డయోగ్నిస్టిక్స్ అనుభవాన్ని అందచేస్తాము.”
 
అమేజాన్ డయాగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవం అనేది భారతదేశంవ్యాప్తంగా తమ కస్టమర్ల కోసం పూర్తిగా సమీకృతమైన ఆరోగ్య సంరక్షణ అనుభవాన్ని రూపొందించే కంపెనీ వారి కలను గణనీయమైన మైలురాయిని సూచిస్తోంది. ఈ విస్తరణ అనేది ఫార్మసీ, క్లీనిక్ యొక్క ఇప్పటికే ఉన్న సేవలు ఆధారంగా అమేజాన్ మెడికల్ పునాదిని శక్తివంతం చేస్తోంది. అమేజాన్ ఫార్మసీతో, కస్టమర్లు విస్తృతశ్రేణి ప్రిస్క్రిప్షన్ మందులు, ఆరోగ్య సంరక్షణ అవసరాలు పొందడంతో పాటు ఉచిత టెలీ వైద్యం సంప్రదింపు సేవలు, ప్రైమ్- నాన్-ప్రైమ్ సభ్యుల కోసం డెలివరీ ప్రయోజనాలు కూడా పొందుతారు.

అమేజాన్ క్లీనిక్ నిరంతరంగా డిజిటల్ అనుభవం ద్వారా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అవసరాల శ్రేణి కోసం లైసెన్స్ గల డాక్టర్లను సంప్రదించడానికి కస్టమర్లకు వీలు కల్పిస్తోంది. డయోగ్నిస్టిక్స్‌ను చేర్చడం అనేది ల్యాబ్ పరీక్ష కూడా అదే నిరంతర సంరక్షణ విభాగంలోకి వస్తుంది. తత్ఫలితంగా కస్టమర్లు తమ ఇళ్ల నుండి డాక్టర్ సిఫారసు చేసిన పరీక్షలను పూర్తి చేయవచ్చు. అమేజాన్ మెడికల్ కింద ఇప్పుడు మూడు సేవలు సమీకృతమవడంతో, అమేజాన్ ఇప్పుడు సంప్రదింపు నుండి పరీక్షలు వరకు సింగిల్, నమ్మకమైన ఇంటర్ ఫేస్-అమేజాన్ మెడికల్ పైన కనెక్ట్ చేయబడిన అవుట్ పేషంట్ ప్రయాణాన్ని అందిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?